Breaking News
Home / National / మెక్సికోలో డ్రగ్‌వార్‌…14 మంది మృతి…

మెక్సికోలో డ్రగ్‌వార్‌…14 మంది మృతి…

అమెరికా : మెక్సికోలో డ్రగ్‌వార్‌కు పోలీసులు బలయ్యారు. ఓ పోలీసు కాన్వాయ్‌పై బుల్లెట్ల వర్షం కురిసింది. ఈ ఘటనలో సుమారు 14 మంది పోలీసు ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. వారికి చెందిన వాహనాలకు నిప్పుపెట్టారు. జెలిస్కో న్యూ జనరేషన్ కార్టల్ గ్రూపు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి కార్టెల్ గ్యాంగ్‌తో పోలీసులు జతకట్టడం వల్లే కాల్పులకు దిగినట్లు జెలిస్కో పేర్కొన్నది. మిచోకన్ రాష్ట్రంలోని ఎల్ అగాజే పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ఇక్కడే మెక్సికోలోని అత్యంత కిరాతకమైన క్రిమినల్ సంస్థలు ఉన్నాయి. జెలిస్కో ఇప్పుడు మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌గా తయారైంది. లిక్కర్ ఇండస్ట్రీలపై దాడి, ఇంధన చోరీ, సింథటిక్ మాదకద్రవ్యాల తయారీల్లో ఆ సంస్థ తలమునకలైంది. అతి హేయమైన హింసకు పాల్పడుతూ దేశంలోనే నెంబర్ వన్ క్రిమినల్ గ్యాంగ్‌గా రూపాంతరం చెందింది.

గత ఆగస్టులోనూ ఆ గ్యాంగ్ సుమారు 9 మందిని చంపి ఓ బ్రిడ్జ్‌కు వేలాడదీసి లవ్లీ పీపుల్ అంటూ భారీ బ్యానర్‌ను పెట్టి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నది. ఆగస్టులోనే ఓ క్లబ్‌లో జరిగిన దాడిలో సుమారు 28 మంది చనిపోయారు. ఆ దాడికి కూడా జెలిస్కో గ్యాంగ్ కారణమై ఉంటుందని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు. జెలిస్కో కార్టల్‌కు నేరచరిత్ర ఎక్కువే ఉన్నది. నాలుగేళ్ల క్రితం ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను లాంచర్‌తో షూట్ చేశారు. ఆ ఘటనలో 15 మంది పోలీసులు చనిపోయారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *