Breaking News
Home / National / బీఐఎస్‌ ప్రమాణాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్…

బీఐఎస్‌ ప్రమాణాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్…

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయగా ఆ జాకెట్లను కేంద్ర వినియోగదారులశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మీడియా ముందు ప్రదర్శించారు. బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్లను మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తయారు చేసినట్లు మంత్రి తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్ (బీఐఎస్‌) ప్రమాణాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సురక్షితమైనవి, తేలికైనవని, 50 శాతం తక్కువ ధరకే వస్తున్నాయని, విదేశాలకు కూడా ఈ జాకెట్లను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ దేశాల జాతీయ నాణ్యతా విధానాల తరహాలో బీఐఎస్‌కు కూడా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లైట్ వెయిట్‌ జాకెట్లు మన జవాన్లకు బాగా సరిపోతాయన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *