హైదరాబాద్: వలస కూలీలతో ఒడిశాలోని కటక్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని ఖుర్ధా జిల్లా కుహిడి చౌక్ వద్ద ఆగి ఉన్న లారీని మంగళవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో హైదరాబాద్కు చెందిన బస్సు డ్రైవర్ శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నగరానికి చెందిన ప్రైవేట్ బుస్సు ఒడిశాకు చెందిన వలస కూలీలతో సోమవారం హైదరాబాద్ నుంచి కటక్ బయల్దేరింది.
