Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా

అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా

అనంతపురం: జిల్లాలోని తపోవనం కూడలిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన వాసిగా గుర్తించారు. బెంగళూను నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన బస్సు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *