Breaking News
Home / Lifestyle / Business / నోకియా ఫోన్లు కొనుగోలు చేస్తే గిఫ్ట్ కార్డులు…

నోకియా ఫోన్లు కొనుగోలు చేస్తే గిఫ్ట్ కార్డులు…

బిజినెస్ : నోకియా తన వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లోని వినియోగదారుల కోసం బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని నోకియా ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొనుగోలు చేసే పలు నోకియా స్మార్ట్‌ ఫోన్లపై గిఫ్ట్ కార్డులను అందజేయనున్నారు. అందుకు గాను ఫోన్లను కొన్నాక కస్టమర్లు చెకవుట్ పేజీలో గిప్ట్ కార్డ్ అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ కొన్నాక కస్టమర్లకు గిఫ్ట్‌కార్డు వస్తుంది. దాన్ని 30 రోజుల లోపు మరొక నోకియా ఫోన్ కొనుగోలుపై ఉపయోగించుకోవచ్చు.

ఇక బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు నోకియా 7.2, నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.5వేల విలువైన గిఫ్ట్ కార్డ్ ఇస్తారు. అలాగే నోకియా 8.1, 4.2, నోకియా 3.1 ప్లస్, నోకియా 3.2, నోకియా 2.2 ఫోన్ల కొనుగోలుపై రూ.2వేలు, నోకియా 6.2 ఫోన్ కొనుగోలుపై రూ.4వేల విలువైన గిఫ్ట్ కార్డులను అందివ్వనున్నారు.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *