Breaking News
Home / National / పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం…

పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం…

ఢిల్లీ: మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌వంటి దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. అయితే, ఈ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్‌లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *