Breaking News
Home / Politics / నేడు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం…

నేడు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం, నూతన సచివాలయం నిర్మాణంతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె తదితర అంశాలపై ప్రధానంగా మంత్రిమండలిలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ కొంతకాలంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి అస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించి దానిపై కొద్ది రోజులుగా సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన పలు దఫాలుగా చర్చలు జరిపారు. సాధ్యమైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టం విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు రెవెన్యూ చట్టంపై కసరత్తు చేసిన అనంతరం ముసాయిదాను రూపొందించారు. ముసాయిదాపై కేబినేట్‌లో చర్చ జరగనుందని తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *