Breaking News
Home / Health / డెంగ్యూ తగ్గడానికి బొప్పాయి కారణమా…?

డెంగ్యూ తగ్గడానికి బొప్పాయి కారణమా…?

హెల్త్ టిప్స్: ఇప్పుడు ప్రజలందర్ని వణికిస్తున్న వ్యాధి డెంగ్యూ. ఈ డెంగ్యూ జ్వరంతో పట్టణాలు, పల్లెలు బెంబేలెత్తి పోతున్నాయి. ఇప్పటికే నగరంలో డెంగ్యూ బారిన పడి చాలా మంది మృతి చెందారు. ఇక డెంగ్యూ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ప్లేట్‌లెట్స్. ఈ వ్యాధి సంక్రమిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ గణనీయంగా తగ్గిపోతాయి. అందుకోసం బొప్పాయి పండు గాని, వాటి ఆకుల రసం గాని సేవిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరుగుతాయని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వార్తను కొందరు ప్రజలు విపరీతంగా నమ్ముతుండగా, మరికొందరు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు డాక్టర్లు ఈ వార్తపై ఏమంటున్నారో తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరంలో అసలు సమస్య ప్లేట్‌లెట్స్ తగ్గటం కాదని డాక్టర్లు అంటున్నారు. రక్త నాళాల్లోంచి ప్లాస్మా ద్రవం లీకై రక్తం చిక్కపడటం అనేది డెంగ్యూ వలన కలిగే అసలు సమస్య అని, బొప్పాయి ఆకు రసంలో ఉన్న రసాయనాలు కొంతమేరకు ప్లేట్‌లెట్స్‌ను పెంచుతున్నట్టు కొన్ని పరిశోధనల్లో వెల్లడైనా అవి డెంగ్యూ చికిత్సకు సరిపడేంత స్థాయిలో లేవన్నది గుర్తించాలంటున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ వ్యాధి కోసం సిఫారసు చేయటం లేదంటున్నారు. బొప్పాయి పండ్లు, కివీ, జామపండ్లు, కలబంద రసం వంటివీ డెంగ్యూ తగ్గటానికి ఉపయోగపడవని డాక్టర్ల వాదన. వీటిపై ఆధారపడి చికిత్స తీసుకోకపోవటం సరికాదంటున్నారు. ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా భయపడాల్సిన అవసరం లేదని, కాని సొంత వైద్యంపై ఆధారపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *