Breaking News
Home / National / కలుషిత పాలలో క్యాన్సర్ కారకాలు..

కలుషిత పాలలో క్యాన్సర్ కారకాలు..

న్యూఢిల్లీ : దేశంలోని 6 శాతం కలుషిత పాల శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలున్నాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నేషనల్ మిల్క్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సర్వేలో వెల్లడైంది. దేశంలో సేకరించిన 6 శాతం పాల నమూనాల్లో క్యాన్సర్ వ్యాధి కారకమైన అఫ్లాటాక్సిన్ ఎం1, కాలేయ విష సూక్ష్మ కలుషితాలున్నాయని పరీక్షల్లో తేలింది. దేశవ్యాప్తంగా 50వేలమంది జనాభా నివాసముంటున్న 1103 పట్టణాల నుంచి పాల శాంపిళ్లను పరీక్షించగా, అందులో 6,432 నమూనా పాలు తాగడానికి సురక్షితం కాదని రుజువైంది. దేశం మొత్తంమీద 7 శాతం పాల నమూనాలు తాగడానికి సురక్షితం కాదని తేలింది. 12 పాల నమూనాల్లో డిటర్జెంట్, యూరియాలు కలిపి కల్తీ చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈవో పవన్ అగర్వాల్ చెప్పారు. పాలల్లో 0.5 పీపీఎం అనుమతించదగిన పరిమితికి మంచి అఫ్లాటాక్సిన్ ఎం1 అవశేషాలు తమిళనాడు, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఉందని వెల్లడైంది. కలుషితమైన పశుగ్రాసం వల్లనే పాలలో క్యాన్సర్ కారకాలు వస్తున్నాయని పరీక్షల్లో తేలింది. 1.2 శాతం పాల నమూనాల్లో పురుగుమందుల అవశేషాలున్నాయని వెల్లడైంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *