Breaking News
Home / States / Andhra Pradesh / అమరావతి కోసం గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ

అమరావతి కోసం గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు పండుగ కూడా జరుపుకోకుండా ధర్నాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులు చేపట్టిన దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం రాత్రి గుంటూరులో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఏకపక్ష నిర్ణయాలు వద్దు.. అమరావతి ఆంధ్రులకు ముద్దు’ అని ‘జై అమరావతి.. జైజై అమరావతి.. వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు.

రాజధాని గ్రామాల్లో రైతులు ప్రశాంతంగా ధర్నాలు చేస్తున్న వారిని టెంట్లు కూడా వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తుళ్లూరులో ప్రైవేటు స్థలంలో టెంట్లు వేయడానికి సిద్ధమైనా దానికి కూడా పోలీస్ స్టేషన్‌ నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా రైతులు తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఉదయాన్నే రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్లపైకి వచ్చి దీక్షా శిబిరాల్లో పాల్గొంటున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *