Breaking News
Home / Crime / ఈఎంఐలు చెల్లించలేక …

ఈఎంఐలు చెల్లించలేక …

ముంబై : టీవీలో ప్రసారమయ్యే నేర వార్తల ప్రభావంతో ఓ జంట తమ పొరుగింటి వృద్ధురాలిని చంపి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన కలకలం రేపింది. థానేలో జరిగిన ఈ దారుణ ఘటనలో వృద్ధురాలిని చంపి విలువైన వస్తువులను కాజేసిన దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.తొలుత వృద్ధురాలి ఇంటి నుంచి ఆమె మృతదేహం పడవేసిన ప్రాంతం వరకూ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినా పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాలేదు. సోనుభాయ్‌ పొరుగున ఉన్న దంపతులపై అనుమానంతో వారిని తమదైన శైలిలో ప్రశ్నించిన ఖాకీలు కీలక విషయం రాబట్టారు. ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించేందుకు సోనుభాయ్‌ను తామే హత్య చేశామని వారు అంగీకరించారు. చిరుద్యోగులైన తాము ఇటీవల ఏసీ, కారు, ఐఫోన్‌ వంటి పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశామని, వాటి ఈఎంఐలను చెల్లించలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టామని చెప్పారు. సోనుభాయ్‌కు పెద్దమొత్తంలో పెన్షన్‌ వస్తుండటంతో ఆమె బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టు తెలుసుకుని వాటిని చేజిక్కించుకునేందుకే ఆమెను హత్య చేశామని వారు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *