Breaking News
Home / States / Andhra Pradesh / కారు ఇంజిన్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

కారు ఇంజిన్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ కార్ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం‌తో ముందు భాగం దగ్ధమైంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇంజిన్‌లో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే.. నూలి లక్ష్మి నర్సింహా అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో ఊరెళ్ళడానికి కారు స్టార్ట్ చేశారు.

ఇంతలో.. కారులో నుంచి దట్టమైన పొగలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలంకు చేరుకోవడంతో అప్పటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగి కారు ముందు భాగం దగ్ధమైంది. సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో కారు పూర్తిగా దగ్ధంకాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Check Also

నదిలోకి కొత్తనీరు…

Share this on WhatsAppనిర్మల్: నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. ఎగువన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *