Breaking News
Home / States / Andhra Pradesh / ఎమ్మెల్యే రోజాను అడ్డగించిన 30 మందిపై కేసు

ఎమ్మెల్యే రోజాను అడ్డగించిన 30 మందిపై కేసు

పుత్తూరు: నగరి ఎమ్మెల్యే రోజాను అడ్డగించిన అసమ్మతివాదులు 30 మందిపై పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరు మండలం కేబీఆర్‌ పురం దళితవాడ వద్ద ఆదివారం గ్రామ సచివాలయ భవన భూమి పూజకు వెళ్తున్న రోజాను వైసీపీ అసమ్మతివాదులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి హరీష్‌, సురేష్‌, సంపత్‌ రుసేంద్ర, అన్బు, మిలిటరీ రామూర్తి, సరళను గుర్తించగా మరో 23 మందిని గుర్తించాల్సి ఉందని సీఐ వెంకట్రమణారెడ్డి తెలిపారు. కాగా ఎమ్మెల్యే రోజా కారును అడ్డుకోవడాన్ని వైసీపీ దళిత విభాగం నాయకులు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కొంతమంది స్వార్థపరుల ప్రోద్బలంతో ఇదంతా జరిగిందన్న వారు వారి ఉచ్చులో పడవద్దని సాటి దళితులుగా కోరుతున్నామని తెలిపారు.మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ అంకయ్య, మాజీ సర్పంచులు బాలాజి, సుదర్శనం, ఏలుమలై, లక్ష్మణమూర్తి తదితరులు ఉన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *