Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు….

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు….

అమరావతి : ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు.

కాగా, మొన్నటి ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, సహా పలు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసినట్టు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *