Breaking News
Home / Film News / హీరో అక్షయ్‌ కుమార్‌పై కేసు నమోదు…

హీరో అక్షయ్‌ కుమార్‌పై కేసు నమోదు…

ముంబై : బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అక్షయ్‌ నటించిన యాడ్‌కు సంబంధించి ఆయనపై మరాఠాలు మండిపడ్డారు. ఓ వాషింగ్‌ పౌడర్‌ కంపెనీ ప్రచారానికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్‌ మరాఠా యోధుడిగా కనిపించారు. ఆ యాడ్‌లో అక్షయ్‌ పాత్ర తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మరాఠాలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్షయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని వీడియోలను, ఫొటోలను ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఫిర్యాదు మేరకు ముంబైలోని వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో అక్షయ్‌పై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి అక్షయ్‌ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *