హైదరాబాద్: ‘సాహో’ చిత్ర నిర్మాతలపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాహో చిత్ర నిర్మాతలు తమ సంస్థ పేరును సినిమా సన్నివేశాల్లో ప్రదర్శిస్తామని నమ్మించి రూ.1.40కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఆర్క్టిక్ ఫాక్స్ బ్యాగ్స్ తయారీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు.
