Breaking News
Home / States / Andhra Pradesh / 3000 దాటిన కేసులు

3000 దాటిన కేసులు

విజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు నెలల్లో వచ్చిన కేసుల కంటే ఇవి ఎక్కువ కావడం ఆందోళనకర పరిణామం. జిల్లాలో మార్చి 21న మొదటి పాజిటివ్‌ కేసు నమోదైన దగ్గరి నుంచి.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు కలిపి మొత్తం 101 రోజుల్లో 1467 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జులై ఆరంభం నుంచి కేసులు ఉద్ధృతంగా నమోదవుతూ.. రోజుకు వంద నుంచి 200మంది వరకూ వైరస్‌ బారినపడుతున్నారు. జులై నెల 17 రోజుల్లోనే 1554 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3021కి చేరాయి. తాజాగా గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకూ కొత్తగా మరో 37మంది వైరస్‌ బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటివరకూ వైరస్‌ బారినపడిన వారిలో 2108 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయి ఇళ్లకు చేరారు. 86మంది వైరస్‌ వల్ల చనిపోయారు. మిగిలిన 827మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. జనంలో వైరస్‌ విషయంలో పెరిగిన నిర్లక్ష్యమే కేసుల ఉద్ధృతికి ప్రధాన కారణంగా మారుతోంది. కాళేశ్వరరావు మార్కెట్‌, బీసెంట్‌రోడ్డు సహా ఎక్కడ చూసినా జనం కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. కనీస సామాజిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లను ధరించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్లు అధికంగా కనిపిస్తున్నారు. జనంలో వైరస్‌పై మరింత అవగాహన పెరిగితేనే.. ఉద్ధృతికి అడ్డుకట్ట పడేందుకు ఆస్కారం ఉంటుంది. అధికారులు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాలనీలు, రహదారుల వెంబడి మైక్‌లో హెచ్చరించే పద్ధతిని విస్తృతంగా చేపట్టడం ద్వారా ఉద్ధృతికి అడ్డుకట్ట పడేందుకు అవకాశం ఉంటుంది.

మొత్తం కేసులు: 3021

మార్చి 21 నుంచి జూన్‌ 30వరకు: 1467

(మార్చి: 6, ఏప్రిల్‌: 240, మే: 219, జూన్‌: 1002)

జులై 1 నుంచి 17 వరకు: 1554

Check Also

శ్రీవారి హుండీ ఆదాయం రూ.64లక్షలు

Share this on WhatsAppతిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 6917 మంది భక్తులు దర్శించుకున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *