Breaking News
Home / Crime

Crime

స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం…వ్యక్తి మృతి

గోపవరం: వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం ద్వారకా కన్సెక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు నెల్లూరు జిల్లా కదిరినాయుడు పల్లెకు చెందిన బసిరెడ్డి నాగిరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read More »

నైరోబీలో ఉగ్రదాడి… ఐదుగురు మృతి

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు ఒక హోటల్‌పై దాడి చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హోటల్ బయట పలు మృతదేహాలు పడివున్నాయి. హోటల్ బయటి నుంచి భారీ శబ్ధాలు వినిపించడంతో చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. చార్లెస్ నజెంగా అనే ప్రత్యక్ష సాక్షి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ‘నేను చాలా భయకరమైన …

Read More »

ఏటీఎంలో నకిలీ నోట్ల జమ.. మహిళ కోసం గాలింపు

వేలూరు: వేలూరులో ఏటీఎంలో నకిలీ నోట్లను జమ చేసిన వ్యవహారంలో ఓ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక బాగాయం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం కేంద్రం ద్వారా గత 8వ తేది ఓ మహిళ రూ.30 వేలను జమ చేశారు. అదే సమయంలో అవి నకిలీ నోట్లని మెషీన్‌ నుంచి రసీదు వచ్చింది. అనంతరం ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన అధికారులు నకిలీ నోట్లను గుర్తించారు. దీంతో, …

Read More »

శ్మశానవాటికలో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ శ్మశానవాటికలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వికారాబాద్ తాండూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన విజయ్(35)గా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగోలేక విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డ హస్పిట్‌లో వైద్యం నిమిత్తం ఉప్పల్‌ బీరప్పగడ్డలోని బంధువుల ఇంటికి వచ్చిన విజయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని …

Read More »

తిరుమలలో చోరీ

రూ.1.20 లక్షల అపహరణ తిరుమల: తిరుమలలోని ఓ కాటేజీలో శనివారం చోరీ జరిగింది. గది తా ళం పగలగొట్టి మరీ గుర్తుతెలియని వ్య క్తులు పర్సుల్లోని నగదును అపహరిం చు కు వెళ్లారు. బాధితులు మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన రమణారావు తన స్నేహితులతో కలసి శ్రీవారి దర్శనార్థం శనివారం తి రుమలకు వచ్చారు. ఈ మేరకు స్థానిక బేలా కుటీరంలో 5 నెంబరు గదిని అద్దెకు …

Read More »

సంక్రాంతి బోనస్ ఇవ్వలేదని భార్యను చంపిన భర్త

మదురై: తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన పొంగల్ (సంక్రాంతి) బోనస్ కోసం భార్యాభర్తల మధ్య తలెత్తిన కీచులాట హత్యకు దారితీసింది. క్షణికావేశంలో భార్యను కొడవలితో భర్త హత్య చేశాడు. మృతురాలిని 65 ఏళ్ల ఆర్.రాజమ్మాళ్‌గా గుర్తించారు. గత శనివారంనాడు మదురైలోని ఏళుమలై గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, రాజమ్మాళ్, రామర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో వాళ్లు వేరేచోట …

Read More »

‘దృశ్యం’ సినిమా చూసి ఎంత పనిచేశారో చూడండి!

హిందీలో ద్రిశ్యం, తెలుగులో దృశ్యం. పేరు వేరైనప్పటికీ కథ ఒకటే. 2015లో అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో విడుదలైన ‘ద్రిశ్యం’ సినిమాను చూసిన ఓ బీజేపీ నేత అదే తరహాలో ఓ 22 ఏళ్ల మహిళను హత్య చేశాడు. రెండేళ్లుగా ఈ నిజాన్ని సమాధి చేయాలని చూశాడు. కానీ పోలీసులు అతని గుట్టును రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన ట్వింకిల్ దాగ్రే(22) అనే …

Read More »

హీరా గ్రూపు దందాలో తెరవెనుక పెద్దలు ఎవరు?

వేలకోట్ల రూపాయల స్కీములతో దేశ విదేశాల్లో ముస్లిం మతస్తులను దోచేసిన హీరా గ్రూపు నిర్వాహకురాలు నౌహీరాషేక్ తెరముందు కన్పించే బొమ్మేనా? హీరా గ్రూపును తెర వెనుక ఆడిస్తున్నదెవరు? హీరా గ్రూపు ద్వారా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన వేలకోట్ల డబ్బు.. గల్ఫ్‌ దేశాల్లోని ఉద్యోగులను మోసగించిన సొమ్ము ఏ విధంగా దేశం దాటింది ? హీరా గ్రూపు న్యాయవాది వినీత్ దండా విదేశీ కంపెనీలోకి నిధులెక్కడి నుంచి వెళ్లాయి? …

Read More »

నగరంలోకి కొత్తరకం డ్రగ్స్‌..

‘యాబా’ మత్తు పదార్థం విక్రయిస్తున్న మయన్మార్‌ దేశస్థులు ఇద్దరు రొహింగ్యాల అరెస్టు రూ. 3.50 లక్షల విలువైన ట్యాబ్లెట్లు స్వాధీనం హైదరాబాద్‌ సిటీ: మనదేశంలోకి అక్రమంగా చొరబడ్డారు.. శరణార్థులుగా మారి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. అంతటితో ఆగకుండా ఇక్కడ కొంత మంది దళారులతో కలిసి ఆధార్‌, రేషన్‌ కార్డులు, స్థానికత సంపాదించే క్రమంలో కొందరు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరికొందరు …

Read More »

భార్యకు వచ్చిన మెసేజ్‌ చూసి మనస్తాపంతో భర్త ఆత్మహత్య..!

ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన భార్య మనస్తాపంతో భర్త ఆత్మహత్య అనాథగా మారిన చిన్నారి హైరదాబాద్: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నతల్లి వెళ్లిపోవడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అభం శుభం తెలియని చిన్నారి ఏడుస్తుండడంతో స్థానికులు చేరదీశారు. కడప జిల్లా, ఊటూరు మండలం, డొంగూరు గ్రామానికి చెందిన ఎర్రగోను మల్లికార్జున్‌రెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి(26), విజయవాడకు చెందిన పావనిరెడ్డి …

Read More »