Breaking News
Home / Film News

Film News

సి.సి.సి కోసం ప్రభాస్ రూ.50లక్షల విరాళం

కరోనా వైరస్ మీద ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తూ భారీగా విరాళమిచ్చిన హీరో ప్రభాస్.. మరో రూ.50లక్షలు విరాళం ఇచ్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులకు సాయం రూ.50లక్షల విరాళాన్ని ప్రభాస్ ఇచ్చాడు. చిరంజీవి నేతృత్వంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ(CCC)కి ఈ మొత్తాన్ని విరాళమిచ్చాడు. కాగా ఇప్పటికే ప్రభాస్ రూ.4కోట్లు విరాళమివ్వడం తెలిసిందే.

Read More »

పాటల ద్వారా ఎస్పీ బాలు విరాళాలు

కరోనా నివారణకు పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో విరాళాల సేకరణకు ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శని, సోమ, బుధ, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.30వరకు పాటలు పాడతానని, మీకు ఏ పాట కావాలో ఫేస్‌బుక్ ద్వారా అడగొచ్చన్నారు. ప్రతిపాటకు రూ.100 చెల్లించాలని బాలు చెప్పారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం పాటలు కూడా పాడతానన్నారు.

Read More »

బాలయ్యతో మంచు విష్ణు?..

నందమూరి బాలకృష్ణ ఓ మల్టీస్టారర్ మూవీకి సిద్ధమవుతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా రిమేక్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్‌గా బీజూ మీనన్ పాత్రలో బాలయ్య నటిస్తాడని, మరో హీరోగా మంచు విష్ణును తీసుకోనున్నారని టాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More »

ఆర్ఆర్ఆర్’ చరణ్ సర్‌ప్రైజ్ వీడియో

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ వీడియో వచ్చేసింది. హ్యాపీ బర్త్ డే రామరాజు అంటూ ‘RRR’ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ‘రామరాజు కోసం భీమ్’ అంటూ సాగే ఈ వీడియోలో అల్లూరిని వర్ణిస్తూ NTR చెప్పే డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా 2021, జనవరి …

Read More »

ఇంట్లో ఉండడమే నాకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్..

లాక్‌డౌన్ నేసథ్యంలో తన అభిమానులు ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉండడమే తనకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తెలిపాడు. గురువారం అర్థరాత్రి నుంచి తనకు విషెస్ చెప్పిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్ చిన్నప్పటి ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. I was naturally overjoyed …

Read More »

తెలుగు హీరోలకు ధన్యవాదాలు…

కరోనా కట్టడికి తెలుగు హీరోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘రూ.4కోట్ల భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్.. మహేష్ బాబు రూ.కోటి, నా అన్న బిడ్డ రాంచరణ్ రూ.70లక్షలు, యువశక్తి NTR రూ.75లక్షలు, బన్నీ రూ.కోటి 25లక్షలు ఇవ్వడం అభినందనీయం’ అని ట్వీట్ చేశారు. అలాగే సినిమా కుటుంబం నుంచి మొదటిగా విరాళం అందించిన నితిన్‌ను మెచ్చుకోవాల్సిందే అన్నారు.

Read More »

నాకు ఈ రోజు వస్తుందా?: రాంచరణ్

రాంచరణ్ బర్త్‌డే సందర్భంగా ఇవాళ సర్‌ప్రైజ్ ఒకటి ఇస్తానంటూ గురువారం NTR ట్వీట్ చేశాడు. దీంతో RRR సినిమాలోని చరణ్ లుక్‌కు సంబంధించిన వీడియో వస్తుందేమోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘రాజమౌళితో కలిసి ఇప్పుడే చెక్ చేశాను. 4 గంటలకు తప్పనిసరిగా వస్తుందని రాజమౌళి నాకు చెప్పాడు’ అని NTR ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన చరణ్.. ‘నాకు ఈరోజు వస్తుందా’ అని రిప్లై ఇచ్చాడు.

Read More »

ఇళ్లలోనే ఉండి పోరాడదాం…

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. అందరం ఇళ్లలో ఉండి కరోనాపై పోరాడదామని హీరోయిన్ లావణ్య త్రిపాఠి పిలుపునిచ్చింది. మనందరి ఆరోగ్యాలను కాపాడేందుకు వేలాదిమంది ఆస్పత్రుల్లో, రోడ్ల మీద పని చేస్తున్నారని తెలిపింది. వైరస్‌ను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన టైం సమీపించిందని.. అందరం ఒకరికి ఒకరం తోడుగా కరోనాపై విజయం సాధిద్దామని పిలుపునిచ్చింది. WHO సూచనలను పాటించాలని ఆమె సూచించింది.

Read More »

‘RRR’ టైటిల్ ఇదే

మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ NTR నటిస్తున్న మల్టీస్టారర్ ‘RRR’ టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ను దర్శకుడు రాజమౌళి ఖరారు చేశాడు. ఎన్నో పేర్లను పరిశీలించిన తర్వాత ఈ టైటిల్‌ను ఓకే చేశాడు. టైటిల్‌తో పాటు సినిమా మోషన్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశాడు. టైటిల్, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే …

Read More »

చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నుంచి ఈ మాధ్యమంలోనూ సందడి చేయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కాబోతోంది. మీ మెగాస్టార్‌ చిరంజీవి తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ఆయన్ను ఫాలో కావడానికి సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేసింది. …

Read More »