Breaking News
Home / hyderabad

hyderabad

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు..

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ ఉన్నా.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక …

Read More »

రాగల మూడు రోజుల్లో వర్ష సూచన

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవచ్చని పేర్కొంది. అలాగే శనివారం, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్ష సూచన ఉందని వెల్లడించింది. సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. కాగా గత వారం …

Read More »

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: ఈటల

హైదరాబాద్‌: టీఎన్‌జీవో ఆధ్వర్యంలో నారాయణగూడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. దాదాపు 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..” కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే దేవుడు అన్నారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారు. వైద్యులపై దాడిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైద్యులు వారి …

Read More »

2 గంటలకు కరోనాపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో నేటి మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు కేబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలు – సడలింపులపై చర్చించనున్నారు. దీనికి వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు.

Read More »

తెలంగాణలో 700లకు చేరిన పాజిటీవ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 700 పాజిటీవ్ కేసులు నమోదుకాగా 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక 496 మందికి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కుమ్రంభీం జిల్లా జైనూరులో అధికారులు మరొక కరోనా పాజిటీవ్ కేసు నిర్ధారించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తితో …

Read More »

గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు. పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మంది స్టాఫ్‌నర్సులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ప్రకటించడంతో …

Read More »

సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం

సనత్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్‌ కు పంపనున్నట్లు తెలిపారు.

Read More »

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం పర్యటించారు. ఖైరతాబాద్, విజయనగర్‌ కాలనీ, మల్లేపల్లిలో ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకి రాకుండా లోపలే ఉండాలని మంత్రి సూచించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయలు, ఇతర వస్తువులను అందజేస్తున్న తీరును జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌.. కేటీఆర్‌కు వివరించారు. ఈ క్రమంలో ఓ …

Read More »

డీఐజీలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్‌లు

హైదరాబాద్: డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. నిజామాబాద్ సీపీగా కార్తికేయ, రామగుండం సీపీగా సత్యనారాయణ, సీఐడీ డీఐజీలుగా సుమతి, శ్రీనివాసులు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా వెంకటేశ్వరరావు, పోలీస్ అకాడమీ ఉపసంచాలకులుగా రమేష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

Read More »

19న తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్: ఈనెల 19న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, అలాగే లాక్ డౌన్ కొనసాగింపు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు ఇవ్వాలా? వద్దా? ఒకేవేళ ఇస్తే.. ఏయే అంశాలను పరిగణలోకి …

Read More »