Breaking News
Home / Jobs

Jobs

ఉద్యోగానికి రాకపోయినా జీతం ఇవ్వాల్సిందే…

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ సమయంలో ఉద్యోగులను తొలగించకూడదు. సాధారణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు తగ్గించడం చేయకూడదు. కరోనా కారణంగా ఉద్యోగం చేసేందుకు అనువైన పరిస్థితులు లేక కార్మికులు సెలవు తీసుకుంటే.. అతడు విధుల్లో ఉన్నట్లుగానే భావించాలి. ఈ సెలవు కాలానికి జీతంలో కోత పెట్టకూడదు’ అని ఆయన చెప్పారు.

Read More »

ఉద్యోగ సమాచారం

✎ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 37 పోస్టుల దరఖాస్తుకు మార్చి 22 చివరి తేదీ. వివరాలకు https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్ చూడండి. ✎ISROలో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 3 చివరి తేదీ. వివరాలకు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌ చూడండి.

Read More »

ఆర్మీలో పనిచేయాలనుకునేవారికి మంచి అవకాశం

అమరావతి : గుంటూరులో మే 5 నుంచి 17వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు ఇందులో పాల్గొనవచ్చు. 8వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు అర్హులు. వయస్సు 17- 23 సంవత్సరాల మధ్య ఉండాలి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 19వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: joinindianarmy.nic.in

Read More »

గూగుల్ ఉద్యోగికి కరోనా

బెంగుళూరులోని గూగుల్ కార్యాలయంలో పని చేస్తున్న 26ఏళ్ల ఉద్యోగికి కరోనా సోకింది. ఇటీవల గ్రీస్ నుండి వచ్చిన ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కంపెనీ మిగిలిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో సదరు వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించడం.. అదే భారతదేశంలో తొలి కరోనా వైరస్ మరణంగా నమోదు కావడం తెలిసిందే.

Read More »

ఉద్యోగ సమాచారం

– హైదరాబాద్‌లో DRDO ఉద్యోగాల(60) భర్తీకి దరఖాస్తులు కొనసాగుతున్నాయి. దరఖాస్తులకు ఈనెల 20 చివరి తేదీ. వివరాలకు https://www.drdo.gov.in/home వెబ్‌సైట్ చూడండి. – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా, పలు విభాగాల్లోని 41 ఉద్యోగాలకు దరఖాస్తుల పక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈనెల 12 చివరి తేదీ. పూర్తి వివరాలకు upsconline.nic.in వెబ్‌సైట్ చూడండి.

Read More »

ఉద్యోగ సమాచారం…

☛ NABCONS(నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్) 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. అది రేపటితో ముగియనుంది. డిగ్రీ, PG, MBA చేసిన వారు అర్హులు. వివరాలకు http://www.nabcons.com/ సైట్ చూడండి. ☛ అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 218 పోస్టుల కోసం LIC నోటిఫికేషన్ జారీ చేయగా.. అది ఈ నెల 15తో ముగియనుంది. వివరాలకు http://ibps.sifyitest.com/ సైట్ చూడండి.

Read More »

జల మండలిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ జలమండలిలో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 93 మేనేజర్‌ ఉద్యోగాలకు శనివారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, ఐటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Read More »

ఉద్యోగం ఎందుకు రావడం లేదు?

కొంతమంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం మాత్రం పొందలేకపోతుంటారు. మీ రెజ్యూమ్ ఇంప్రెసివ్‌గా లేకపోవడం, ఉద్యోగానికి తగిన అర్హత లేకపోవడం, ఇంటర్వ్యూలో తగిన పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం, మీ స్కిల్ ఉద్యోగానికి తగ్గట్లు లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్  లోపించడం, యాటిట్యూడ్ ఉండటంలాంటివి ఉద్యోగం రాకపోవడానికి కారణాలు కావచ్చు. ఇందులో మీరు దేని వల్ల ఉద్యోగం పొందలేకపోతున్నారో గుర్తించి.. దాన్ని అధిగమించగలిగితే విజయం మీదే.

Read More »

NHAI, BELలో టెక్నికల్ పోస్టులు…

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో 170 ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ మార్చి 11. విద్యార్హత సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. పూర్తి వివరాలకు nhai.gov.in/ వెబ్‌సైట్ చూడండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BELలో 174 పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. చివరి తేదీ మార్చి 16. పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్‌సైట్లో చూడవచ్చు.

Read More »

ఏపీలో 5వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల అంగన్ వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్‌ 31 నాటికి 1,665 అంగన్‌వాడీ వర్కర్లు, 3,347 అంగన్‌వాడీ హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

Read More »