Breaking News
Home / Lifestyle

Lifestyle

మరిన్ని నగరాలకు సేవలు విస్తరిస్తాం!…

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగుళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఈథర్‌ ఎనర్జీ ద్విచక్రవాహన శ్రేణిలో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈథర్‌ 450x పేరుతో అమ్మకాలు చేపడుతోంది. విడుదల సమయంలో బెంగుళూరు, చెన్నై నగరాల్లో విక్రయాలు చేపట్టిన ఈథర్‌ ఎనర్జీ తన సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పూణె, ముంబైతో పాటు హైదరాబాద్‌కు విస్తరించింది. ఇప్పుడు మరో నాలుగు నగరాల్లో ఈథర్‌ బైక్‌లను విక్రయించనున్నట్లు పేర్కొంది. కోచి, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, …

Read More »

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కురిక్యాల గ్రామానికి చెందిన కెంచ కనుకవ్వ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కనుకవ్వ శరీరంపై నుండి లారీ దూసుకెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రగాయాలైన కొమరయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. …

Read More »

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని… పలువురికి గాయాలు

తూర్పు గోదావరి: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేస్తూ అమలాపురం నుంచి వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

చెరువులోకి దూసుకెళ్లిన కారు..

యాదాద్రి: రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురు కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది. కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గర …

Read More »

శారీ రోలింగ్ బిజినెస్‌తో లాభాలు వస్తాయా?

మహిళల సాంప్రదాయ దుస్తుల్లో చీరలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టు చీరలు లేదా ఫ్యాన్సీ చీరలను రోలింగ్ చేయించి భద్రపరిచే మహిళల సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ శారీ రోలింగ్ బిజినెస్‌ను ఇంటి దగ్గర కానీ ఏదైనా షాపులో కానీ ఏర్పాటుచేసుకోవచ్చు. రోలింగ్ మెషీన్ ఖరీదు రూ.1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకు 50 చీరలు రోలింగ్ చేసినా చీరకు రూ.60 చొప్పున రూ.3,000 వరకు ఆదాయం వస్తుంది.

Read More »

భారీగా పెరగనున్న బంగారం ధర…

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో.. ఆ ఎఫెక్ట్ బంగారంపై పడింది. దీంతో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 10 గ్రాముల బంగారం రూ.43,000కు చేరుకోగా.. భవిష్యత్‌లో రూ.50 వేలకు చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంలో భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఊపందుకుందని నిపుణులు చెబుతున్నారు

Read More »

జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌

ముంబై: రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్‌, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది. దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఇంకా జియో టీవీ, జియో …

Read More »

ఇంజిన్ లో సాంకేతిక లోపం…కారులో మంటలు

ఆదిలాబాద్‌ : కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం టోల్‌ గేట్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కారులో మంటలు రావడంతో… అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారులో ఉన్న లక్ష రూపాయలు బుగ్గిపాలయ్యాయి. అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. కాగా …

Read More »

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం…

సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన అర్జున్, భీమాగా గుర్తించారు. మృతులిద్దరూ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »