Breaking News
Home / Lifestyle / Business

Business

మరిన్ని నగరాలకు సేవలు విస్తరిస్తాం!…

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగుళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఈథర్‌ ఎనర్జీ ద్విచక్రవాహన శ్రేణిలో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈథర్‌ 450x పేరుతో అమ్మకాలు చేపడుతోంది. విడుదల సమయంలో బెంగుళూరు, చెన్నై నగరాల్లో విక్రయాలు చేపట్టిన ఈథర్‌ ఎనర్జీ తన సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పూణె, ముంబైతో పాటు హైదరాబాద్‌కు విస్తరించింది. ఇప్పుడు మరో నాలుగు నగరాల్లో ఈథర్‌ బైక్‌లను విక్రయించనున్నట్లు పేర్కొంది. కోచి, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, …

Read More »

శారీ రోలింగ్ బిజినెస్‌తో లాభాలు వస్తాయా?

మహిళల సాంప్రదాయ దుస్తుల్లో చీరలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టు చీరలు లేదా ఫ్యాన్సీ చీరలను రోలింగ్ చేయించి భద్రపరిచే మహిళల సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ శారీ రోలింగ్ బిజినెస్‌ను ఇంటి దగ్గర కానీ ఏదైనా షాపులో కానీ ఏర్పాటుచేసుకోవచ్చు. రోలింగ్ మెషీన్ ఖరీదు రూ.1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకు 50 చీరలు రోలింగ్ చేసినా చీరకు రూ.60 చొప్పున రూ.3,000 వరకు ఆదాయం వస్తుంది.

Read More »

భారీగా పెరగనున్న బంగారం ధర…

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో.. ఆ ఎఫెక్ట్ బంగారంపై పడింది. దీంతో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 10 గ్రాముల బంగారం రూ.43,000కు చేరుకోగా.. భవిష్యత్‌లో రూ.50 వేలకు చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంలో భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఊపందుకుందని నిపుణులు చెబుతున్నారు

Read More »

జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌

ముంబై: రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్‌, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది. దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఇంకా జియో టీవీ, జియో …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. మిడ్‌ సెషన్‌ తరువాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ చివరికి వారాంతంలో బలహీనంగానే ముగిసాయి. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 41170 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 12081వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 12100 దిగువకు చేరింది. పవర్‌, ఎఫ్‌ఎంసిజి, ఇన్‌ఫ్రా, ఫార్మా, ఐటీ రంగాల్లో అమ్మకాలు జోరు కొనసాగగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో …

Read More »

వోడాఫోన్‌ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్‌

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డాట్‌)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్‌ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను  చెల్లించిన సంస్థ తాజాగా మరో దఫా చెల్లింపులు చేసింది.  డీఓటీ గణాంకాల బట్టి సవరించిన స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం …

Read More »

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 31 పాయింట్లు కోల్పోయి 41,291 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 12,115 వద్ద కొనసాగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC బ్యాంక్ షేర్లు నష్టపోగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి

Read More »

2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు

2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుకుంటుందని సిస్కో నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని.. 2023 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య 96.6 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడం, అన్ని విషయాలకు ఆన్‌లైన్‌పై ఆధారపడటం వంటి విషయాలతో 2023 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పింది. అటు ఇదే సమయానికి 67 కోట్ల 5జీ కనెక్షన్లు ఉంటాయంది.

Read More »