Breaking News
Home / Lifestyle / Business (page 10)

Business

కరోనాపై ఆర్బీఐ చీఫ్ సంచలన వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందనీ.. ఇప్పటి వరకు సంభవించిన అన్ని ఆర్ధిక సంక్షోభాల కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని ఆయన అన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గతనెల 24 నుంచి 27 వరకు జరిగిన ఆర్బీఐ …

Read More »

ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక…

కరోనా నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు ఎక్కువగా డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుండగా.. పలు నకిలీ వెబ్‌సైట్లూ పుట్టుకొస్తున్నాయి. www.onlinesbi.digital అనేది ఫేక్ వెబ్‌సైట్ అని చెప్పిన SBI.. ఖాతాదారులు ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావొద్దంది. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లతో కొందరు ఖాతాదారుల నగదు కాజేస్తున్నట్లు గుర్తించామంది. SBIకి సంబంధించి ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్లు ఎక్కడైనా కనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలంది.

Read More »

మరింత బలహీనపడిన రూపాయి…

ముంబై : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం 76.29 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి మరో 5 పైసలు బలహీనపడి 76.34 స్థాయికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ఇంట్రాడేలో 76.43 స్థాయిని తాకింది. గత గురువారం 76.54 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయిన రూపాయి చివరకు 76.28 వద్ద ముగిసింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 10 శుక్రవారం కరెన్సీ …

Read More »

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. లాంగ్ వీకెండ్అనంతరం కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నష్టాలనుంచి కోలుకున్నా, వెంటనే మరింత కీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల నష్టంతో 30600 వద్ద, నిప్టీ 160 పాయింట్ల నష్టంతో 8942 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల స్థాయి, నిఫ్టీ 9వేల దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లు …

Read More »

ఐటీ శాఖ కీలక నిర్ణయం…

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి చెల్లింపుదారులకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయనుంది. రూ. 5 లక్షల లోపు రిఫండ్‌లను తక్షణమే చెల్లించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. దీని వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, చెల్లింపుదారులకు వెంటనే ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ విభాగం తెలిపింది. …

Read More »

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ సూచన….

కరోనా నేపథ్యంలో దేశంలో ఊహించని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పలు సూచనలు చేసింది. ఖాతాదారులు తాము చెల్లించాల్సిన ఎలాంటి వాయిదాలనైనా డిజిటల్ విధానంలో చెల్లించాలని సూచించింది. అన్ని బ్యాంకులు డిజిటల్ పేమెంట్ విధానాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో దానిని వినియోగించుకోవడం ద్వారా పరోక్ష సామాజిక దూరాన్ని పాటించినట్లవుతుందని వివరించింది.

Read More »

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కరోనా కారణంగా మరింత కాలం లాక్‌డౌన్‌ విధించొచ్చన్న వార్తలతో నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ముగించడం గమనార్హం. మరింత కాలం లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆయా ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సహా భారత మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కేంద్రం సైతం రెండో ప్యాకేజీకి సిద్ధమవుతోందన్న వార్తలు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ …

Read More »

నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో రికార్డు కనిష్టానికి పతనమైంది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ప్రారంభంలో 23 పైసల లాభంతో 76.11వద్ద కొనసాగింది. అనంతరం లాభాలన్నీ ఆవిరై పోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 76.55 స్థాయికి పతనమైంది. బుధవారం 76.34 వద్ద ముగిసింది. డాలర్ సూచీ 100.17 కీలకమైన గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే …

Read More »

రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి…

ముంబై: అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రుణ రేటును 0.20 శాతం తగ్గించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్‌ఆర్‌) రేటును 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. సవరించిన ఈ వడ్డీరేట్టు ఈనెల 7నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్‌ వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 7.95 శాతం, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8.15 శాతంగా మారిందని తెలిపింది. దీంతో గురువారం …

Read More »

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 782 పాయింట్లు లాభపడి 30,789 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 265 పాయింట్లు లాభపడి 9,0143 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.02గా ఉంది.

Read More »