Breaking News
Home / Lifestyle / Business (page 3)

Business

రిలయన్స్ దూకుడు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ మహాదూకుడు ప్రదర్శిస్తోంది. విదేశీ పెట్టుబడుతో దేశంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. అబూదాబికి చెందిన ముబాదాలా కంపెనీ రిలయల్స్‌లో రూ 9,093.60 కోట్లు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో రిలయన్స్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రికార్డు సృష్టించింది. దీనిపై కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ హర్సం వ్యక్తం చేశారు. ఇన్వెస్టింగ్ దిగ్గజం ముదాదాలా తమతో చేతులు కలపినందుకు సంతోషంగా …

Read More »

స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి…

రికార్డు స్థాయికి ఆర్ఐఎల్ షేరు 34,300 ఎగువకు సెన్సెక్స్ 10100 ఎగువకు నిఫ్టీ ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. వరుస లాభాలకు నిన్న (గురువారం) స్వల్ప విరామం ఇచ్చిన సూచీలు నేడు తిరిగి పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 301 పాయింట్లు ఎగిసి 34269 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 10122 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 34 వేల …

Read More »

ఎయిర్‌టెల్‌ – అమెజాన్‌ భారీ డీల్..!

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చూపు ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది.. ! ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది… 5 శాతం వాటా అయినా అది మామూలు డీల్‌ అని మాత్రం తీసివేయడానికి లేదు.. ఎందుకంటే.. ఆ 5 శాతం డీల్‌ విలువ రూ.15,000 కోట్లుకు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక, దీనిపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు …

Read More »

తగ్గిన బంగారం ధర…

లాక్ డౌన్ కాలంలో బంగారం గురించి భారతీయులు పెద్దగా పట్టించుకోలేదు. బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నా షాపులు వంటివి లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. లాక్ డౌన్ సడలింపులు కారణంగా ఇప్పుడిప్పుడే షాపులు తెరుచుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్నది. ఆర్ధిక పరిస్థితి గాడిన పడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తిరిగి పెరుగుతాయని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ధరలు తగ్గడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం …

Read More »

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడనుందన్న అంచనాల మధ్య కీలక సూచీలు రెండూ జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు ఎగిసి 34363 వద్ద, నిప్టీ 153 పాయింట్ల లాభంతో 10131వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ సాంకేతికంగా 34 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 10100 స్థాయిని అధిగమించడం విశేషం. …

Read More »

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్ల పండుగ..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ తన కస్టమర్ల కోసం తాజాగా పలు ఆఫర్లు తీసుకొచ్చింది.. కరోనా లాక్‌డౌన్‌తో క్రమంగా డేటా వినియోగం పెరిగిపోవడంతో.. టెలికాం సంస్థ మొత్తం ఇప్పుడు డేటా ప్యాక్‌లపై దృష్టిసారిస్తున్న సమయంలో.. బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది‌. కొత్తగా రూ. 1,498 ప్లాన్‌ను తీసు కొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.. ఈ ప్లాన్ ద్వార వినియోగదారులకు 91 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తోంది.. డేటా వ్యాలిడిటీ 365 రోజులగా పెట్టింది.. ఇక, …

Read More »

టెలికాం రంగంలోకి గూగుల్…

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ త్వరలోనే టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతుంది. వొడాఫోన్, ఐడియాలో 5శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఇరువర్గాలు డీల్ విషయంలో నోరెత్తకపోయినా, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. వాస్తవానికి గూగుల్ కూడా జియో ప్లాట్ ప్లామ్స్ లో వాటా కొనేందుకు ప్రయత్నించింది. కానీ ఫేస్ బుక్ సహా బడా ఇన్వెస్టర్లు జియోలో వాటాలు చేజిక్కించుకున్నాయి. దాంతో గూగుల్, వొడాఫోన్ ఐడియాలో వాటాపై దృష్టి …

Read More »

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ మార్కెట్ల రెండు రోజుల వరుస లాభాలకు నేడు ఆరంభ ట్రేడింగ్‌లో అడ్డుకట్టపడింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో నేడు సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అలాగే ఈ త్రైమాసికం వృద్ధి రేటు ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా-చైనా మధ్య మాటల యుద్ధమూ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 334 పాయింట్లు కోల్పోయి …

Read More »

వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడులు…

న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం గూగుల్‌ వొడాఫోన్‌ ఇండియాలో 5 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్‌ ఖరారైతే రూ వేలాది కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్‌కు ఊరట కలిగే అవకాశం ఉంది. రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఇండియాలో వాటా కొనుగోలుకు గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. వొడాఫోన్‌ ఇండియాలో గూగుల్‌ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని …

Read More »

దిగివస్తున్న బంగారం ధరలు….

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో బుధవారం దేశీయ మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు పలు దేశాల్లో ఎత్తివేయడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని ఎంచుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపడం బంగారానికి డిమాండ్‌ను మసకబార్చింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 272 తగ్గి 46,050కి దిగివచ్చింది. ఇక కిలో వెండి స్వల్పంగా తగ్గి రూ …

Read More »