Breaking News
Home / Lifestyle / Business (page 30)

Business

భారీగా పెరిగిన బంగారం ధర….

ఢిల్లీ: డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్స్‌) బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి రూ.44,472కి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో దీని ధర రూ.43,519గా ఉంది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. గత ట్రేడింగ్‌లో రూ.49,404గా ఉన్న ధర రూ.586 పెరిగి రూ.49,990కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు బంగారం …

Read More »

ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా భారత్‌

ముంబై: భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశం ఎంతో దూరంలో లేదని రిలయన్స్‌ అధినేత ముకేశ​ అంబానీ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో ముచ్చటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడ్ సీఈఓ 2020 సమ్మిట్‌లో సత్య నాదెళ్లతో సంభాషించిన అంబానీ డిజిటల్‌ సేవల్లో భారత్‌ అగ్రగామిగా నిలవనుందని చెప్పారు. 2014 …

Read More »

భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా

ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల సోమవారం భారత్‌ చేరుకున్నారు. రానున్న డిజిటల్‌ యుగంలో దూసుకుపోయేందుకు దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్ధ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ చిన్న పెద్ద అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోషించనుందని, ఈ నేపథ్యంలో భారతదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలువల ఉన్నాయని నాదెళ్ల తెలిపారు. …

Read More »

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్లు దిగజారి 40,778 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11,961 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.68 వద్ద కొనసాగుతోంది. చైనా వెలుపల కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండడం మార్కెట్ల భయాల్ని పెంచింది. దీంతో ఆసియా మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో నమోదవుతున్నాయి. దీని ప్రభావమే …

Read More »

ఆ బియ్యమే నా బిజినెస్‌ కెరీర్‌కు పూజాక్షతలు

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బియ్యం లేని భోజనమే లేదు. అందుకే బియ్యం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. పిడికెడు బియ్యం మనిషి మనుగడకు భరోసా.ఆ బియ్యమే నా బిజినెస్‌ కెరీర్‌కు పూజాక్షతలు’’ అంటోంది మణిపురి యువతి ముదిత. నిజమే! ముదిత అన్నట్లు కశ్మీరీ పులావ్, బిర్యానీలతో ఉత్తరాది విందులో అగ్రస్థానం బియ్యానిదే. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇడ్లీ, దోసెల రూపంలో తెల్లవారేదే బియ్యంతో. అయితే ఇప్పుడు టెక్‌ ఇండియా బియ్యానికి …

Read More »

మరిన్ని నగరాలకు సేవలు విస్తరిస్తాం!…

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగుళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఈథర్‌ ఎనర్జీ ద్విచక్రవాహన శ్రేణిలో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈథర్‌ 450x పేరుతో అమ్మకాలు చేపడుతోంది. విడుదల సమయంలో బెంగుళూరు, చెన్నై నగరాల్లో విక్రయాలు చేపట్టిన ఈథర్‌ ఎనర్జీ తన సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పూణె, ముంబైతో పాటు హైదరాబాద్‌కు విస్తరించింది. ఇప్పుడు మరో నాలుగు నగరాల్లో ఈథర్‌ బైక్‌లను విక్రయించనున్నట్లు పేర్కొంది. కోచి, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, …

Read More »

శారీ రోలింగ్ బిజినెస్‌తో లాభాలు వస్తాయా?

మహిళల సాంప్రదాయ దుస్తుల్లో చీరలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టు చీరలు లేదా ఫ్యాన్సీ చీరలను రోలింగ్ చేయించి భద్రపరిచే మహిళల సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ శారీ రోలింగ్ బిజినెస్‌ను ఇంటి దగ్గర కానీ ఏదైనా షాపులో కానీ ఏర్పాటుచేసుకోవచ్చు. రోలింగ్ మెషీన్ ఖరీదు రూ.1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకు 50 చీరలు రోలింగ్ చేసినా చీరకు రూ.60 చొప్పున రూ.3,000 వరకు ఆదాయం వస్తుంది.

Read More »

భారీగా పెరగనున్న బంగారం ధర…

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో.. ఆ ఎఫెక్ట్ బంగారంపై పడింది. దీంతో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 10 గ్రాముల బంగారం రూ.43,000కు చేరుకోగా.. భవిష్యత్‌లో రూ.50 వేలకు చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంలో భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఊపందుకుందని నిపుణులు చెబుతున్నారు

Read More »