Breaking News
Home / Lifestyle / Business (page 4)

Business

నోకియా ప్లాంట్ లో 42 మందికి కరోనా…

చెన్నై : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌ లో కార్యకలాపాలను నిలిపివేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ కర్మాగారంలోని సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారు అనేది నోకియా వెల్లడించలేదు. మరోవైపు కనీసం 42 మందికి కరోనా సోకిందనే వాదన వినిపిస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం …

Read More »

టీవీఎస్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత!…

ఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ కంపెనీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే, ఇది ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మే నుంచి అక్టోబర్‌ వరకు ఈ కోత అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. కరోనా వల్ల ఏర్పడ్డ అనుకోని సంక్షోభం వల్లే ఆరు నెలల పాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. కార్మికస్థాయి …

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధర…

శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.374 పెరిగి,10 గ్రాముల పసిడి ధర రూ.47,061 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసడి రూ.46,466 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.47,130 వద్ద గరిష్టాన్ని తాకింది. నిన్న ఒక్కరోజే 1.4 శాతం పసిడి ధర పుంజుకుంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర 7 డాలర్లు …

Read More »

స్వల్పంగా తగ్గిన బంగారం ధర…

ఈ వారంలో వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన పసడి ధర నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడి మార్కెట్లో రూ.338 తగ్గి 10 గ్రాముల పసిడి రూ. 46,649 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 15 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం 1,727 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇప్పటికీ …

Read More »

నేడు ఆర్బీఐ మీడియా సమావేశం..

లాక్‌డౌన్‌ నిబందనలు సడలింపుపై, దేశ ఆర్ధిక వ్యవస్థపై ఇవాళ ఉదయం 10:00 గంటలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పత్రికా సమావేశం నిర్వహించనున్నారు…కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది…లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే నష్టపోయినా పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి…లాక్‌డౌన్ కారణంగా ఈఎంఐలపై మూడు నెలల పాటు మారిటోరియం ఆర్బీఐ విధించిన విషయం …

Read More »

లాక్‌డౌన్‌లో పేటీఎం హవా..దూసుకుపోతున్న ఈ లెడ్జర్‌ సర్వీస్‌

లాక్‌డౌన్‌ కాలంలో పేటీఎం హవా కొనసాగుతోంది. ముఖ్యంగా రిటైల్‌ వ్యాపారుల కోసం బిజినెస్‌ ఖాతా పేరుతో పేటీఎం తీసుకొచ్చిన ఈ-లెడ్జర్‌ సర్వీస్‌ దూసుకుపోతోంది. సుమారు 15వందల కోట్ల రూపాయల విలువగల చెల్లింపులు.. వినియోగదారుల నుంచి వ్యాపారులకు వచ్చినట్టు పేటీఎం సంస్థ ప్రకటించింది. 2020 జనవరిలో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌లో… ఆ నెల 8 నుంచి మార్చి 14 వరకు వచ్చిన చెల్లింపులతో పోలిస్తే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు …

Read More »

భారీగా పెరిగిన బంగారం ధరలు…

బుధవారం పసిడి ధర భారీగా పెరిగింది. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.495 పెరిగి 10 గ్రామలు పసిడి రూ.47,250 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. పసిడి ఫ్యూచర్స్‌ 1శాతం పెరగగా వెండి 3 శాతం పెరిగింది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర …

Read More »

ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చిన జియో!

ముంబై: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 98ను పూర్తిగా తొలగించింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ ధరను ఇప్పుడు రూ.129కి పెంచేసింది. జియో రూ.98 ప్లాన్‌లో 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియో, ల్యాండ్ లైన్ కాలింగ్ ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉండేవి. రూ. 999 ప్లాన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో రూ. 98 ప్లాన్‌ను …

Read More »

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తున్నారా..?

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ఈ-కామర్స్ కంపెనీలకు భారీ ఊరట కలిగే విషయాన్ని చెప్పింది. అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి ఇప్పటివరకూ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం తాజాగా రెడ్‌జోన్లలో కూడా డెలివరీకి పచ్చ జెండా ఊపింది. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో.. కేంద్ర అనుమతి కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఈ-కామర్స్ కంపెనీలకు …

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు…

ముంబై : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో బంగారం, వెండి ధరలు రికార్డుస్ధాయిలో భగ్గుమన్నాయి. చైనాపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలతో చెలరేగడం, బీజింగ్‌ దీటుగా ప్రతిస్పందిస్తుండటంతో అనిశ్చితి వాతావరణం మదుపరులను బంగారం వైపు ఆకర్షిస్తోంది. మరోవైపు ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో పసిడిపై పెట్టుబడులకు మదపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి …

Read More »