Breaking News
Home / Lifestyle / Technology

Technology

భారత్‌ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్

శాన్‌ఫ్రాన్సిస్కో: భారత వినియోగదారులు కోసం గూగుల్ మ్యాప్స్ ఓ నూతన ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. టాక్సీ డ్రైవర్ రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ‘ఆఫ్ రూట్’‌గా వ్యవహరించే ఈ ఫిచర్ రాంగ్‌రూట్‌లో 500 మీటర్లు ప్రయాణించగానే వినియోగదరాులను ఎలర్ట్ చేస్తుంది. ఇది యాక్టివేట్ కావాలంటే… వినియోగదారులు మొదట గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి. అనంతరం… మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్‌లో ఈ ఆఫ్ రూట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. …

Read More »

హువావేకు భారీ షాకిచ్చిన గూగుల్

న్యూయార్క్: చైనీస్ టెలికం దిగ్గజం హువావేకు ఇప్పుడు ఊపిరి ఆడడం లేదు. ఆ సంస్థకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టగా, ఇప్పుడు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ షాకిచ్చింది. ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్నట్టు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. హువేవాకు ఇకపై హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సహా ఎటువంటి సాంకేతిక సహకారం అందించబోమని తేల్చిచెప్పింది. గూగుల్ నిర్ణయం వల్ల ప్రస్తుతం …

Read More »

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ46

శ్రీహరికోట: దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్‌-2బీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30గంటలకు ఈ ఉపగ్రహంతో పీఎ్‌సఎల్వీ-సీ46 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్‌ ఆదివారం రాత్రి విజయవంతంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం షార్‌లో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ చైర్మన్‌ బీఎన్‌ …

Read More »

వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేస్తున్నారా.. అయితే మీకిది షాకింగ్ వార్తే!

వాట్సాప్ యాజమాన్యం తమ 1.5 బిలియన్ల యూజర్లకు ముఖ్య విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ యాప్ యూజర్లంతా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. వాట్సాప్‌లో ఉన్న వాయిస్ కాల్ ఫీచర్ ద్వారా ఫోన్లలో వైరస్ అటాక్ అవుతున్నట్లు ఆ సంస్థ గుర్తించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ వాట్సాప్ వాయిస్ కాల్స్ అదనపు భద్రతకు సంబంధించి ఫీచర్లను జత చేస్తుండగా ఫోన్లలో ప్రవేశించిందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. …

Read More »

చంద్రుడిపైకి ప్రయాణం ఇక సులువు అంటున్న అమెజాన్ సంస్థల అధినేత

రోవర్లను మోసుకెళ్లడం ప్రత్యేకత 2024లో అందుబాటులోకి..! అమెరికాలో ఆవిష్కరించిన జెఫ్‌ బెజోస్‌ వాషింగ్టన్‌: ‘ఆదిత్య 369’ సినిమాలో టైమ్‌ మెషిన్‌ గుర్తుందా? దాంట్లో ఎక్కి శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్లడం.. తిరిగి రావడం విచిత్రంగా అనిపిస్తుంది కదూ! నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యం కాదు కానీ.. చంద్రుడిపైకి మనుషులను, ఇతర వాహనాలు, పరికరాలను పంపే అంతరిక్ష వాహక నౌక నమూనాను అమెజాన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌ ఆవిష్కరించారు. ఇది …

Read More »

థియేటర్లలో స్క్రీన్ల స్థానంలో ఓనిక్స్.. సినీ ప్రియులకు సరికొత్త అనుభూతి

ఎల్‌ఈడీ బిగ్‌ స్ర్కీన్‌తో ఎగ్జిబిటింగ్‌ రివల్యూషన్‌ దూసుకొస్తున్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెండితెరల స్థానంలో హెచ్‌డీఆర్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ను ఆవిష్కరించిన శామ్‌సంగ్‌ థియేటర్ల యజమానులకు ఇక మల్టీపర్పస్‌ బిజినెస్‌ బిగ్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్లపై విజయవాడలోని ఎగ్జిబిటర్ల ఆసక్తి! బెజవాడకూ భవిష్యత్తులో వచ్చే అవకాశం విజయవాడ: వెండితెర మారుతోంది. ప్రొజెక్టర్‌ స్ర్కీన్లను పక్కకు నెట్టేసి, సరికొత్త అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ దూసుకు వస్తోంది. మనం చూసే సినిమా సహజంగా మన …

Read More »

టిక్‌టాక్‌‌పై నిషేధం ఎత్తివేత

చెన్నై: చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో టిక్‌టాక్ యాప్ గతంలో మాదిరిగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మద్రాస్ హైకోర్టులో టిక్‌టాక్ కేసుపై నేడు విచారణ జరిగింది. అయితే.. అశ్లీలకర, అభ్యంతరకర వీడియోలను అనుమతించేది లేదని టిక్‌టాక్ హామీ …

Read More »

ఈవీఎంలను హ్యాక్‌ చేయలేం!

పనికట్టుకొని కొందరు చేస్తున్న దుష్పచారమిది వీటిని డీ–కోడ్‌ చేయటం చాలా కష్టం ప్రొపరేటర్‌ సెక్యూర్‌ ప్రొటోకాల్‌ పటిష్టమైన భద్రతావ్యవస్థ ప్రముఖ ఐటీ నిపుణుడు సందీప్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌: ఈవీఎంలను హ్యాకింగ్‌/ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్‌ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్‌ డ్రైవర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయలేరని …

Read More »

డేటా ఎలా వస్తోంది

మీరు ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో మెయిల్‌ ఓపెన్‌ చేస్తే, సెకను వ్యవధిలోనే, సముద్రాల అవతల అమెరికాలో ఎక్కడో ఉన్న సర్వర్‌కు ఆ సందేశం వెళుతుంది. అంతే వేగంగా డేటా మళ్లీ మీకు చేరుతోంది. అది ఎలా సాధ్యమవుతోంది? అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా కేబుల్‌ వేశారా? అంటే నిజమే. సముద్ర గర్భంలో ఉన్న కేబుల్‌ ద్వారానే డేటా ప్రసారం జరుగుతోంది. న్యూయార్క్‌ నుంచి సిడ్నీ, హాంకాంగ్‌ నుంచి లండన్‌… ఇలా …

Read More »

పోర్న్‌సైట్ల బైపాస్‌ బాట!

ఆన్‌లైన్‌ అశ్లీలానికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించిన కేంద్రం.. పోర్న్‌సైట్లను నిషేధించి మూడు నెలలు గడిచిపోయాయి! ఆ నిషేధం ఫలించిందా? ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందా? గత ఏడాది నవంబరు 1 నుంచి నిషేధ జాబితాలో ఉన్న 827 వెబ్‌సైట్లు ఇప్పుడు నిజంగానే భారతీయులకు అందుబాటులో లేవా? అంటే.. సమాధానం అంత సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. ప్రభుత్వం విధించిన నిషేధపు కట్టు దాటి.. పోర్న్‌ సైట్ల నిర్వాహకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. …

Read More »