Breaking News
Home / Lifestyle / Technology (page 2)

Technology

ఇంటర్నెట్ సృష్టికర్తకు కరోనా!

న్యూఢిల్లీ: ప్రపంచాన్నే కుగ్రామంగా మర్చేసింది ఇంటర్నెట్. అయితే దీని సృష్టికర్తల్లో ఒకరైన వింట్ సెర్ఫ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్టు తెలిపారు. ఇంటర్నెట్‌ వ్యవస్థకు వెన్నుముక లాంటి టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ రూపకల్పలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాదు.. మనం చూస్తున్న ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్‌కు వెనక కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్‌కు సలహాదారుగా …

Read More »

యూట్యూబ్ కీలక నిర్ణయం….

కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోలు/న్యూస్ హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని కొంతమంది నిజమేనని నమ్ముతున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను డిలీట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. AI టెక్నాలజీ ద్వారా ఫేక్ వీడియోలను గుర్తిస్తామంది. అటు గూగుల్ కూడా ఫేక్ సమాచారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

Read More »

త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో హైటెక్‌ స్మార్ట్‌ మీటర్లు

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు వీలుగా హైటెక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఓ క్లిక్‌ ఇస్తే సరి.. ఆఫీస్‌లోని మెయిన్‌ స్విచ్‌ ఆగిపోతుంది. మళ్లీ మీరు ఆన్‌ చేసే వరకూ ఏ లైటూ వెలగదు. ఈ తరహా టెక్నాలజీని ఏపీ విద్యుత్‌ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మూడేళ్లలో వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు. హైటెక్‌ స్మార్ట్‌ …

Read More »

మీ వాట్సాప్ ఓ సారి చెక్ చేయండి…

వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ పలువురు బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు వచ్చినట్లు సంస్థ తెలిపింది. వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్నాక.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, చాట్స్‌లోకి వెళ్లి, అక్కడ డిస్ప్లేలో థీమ్‌ను ఎంచుకుని, డార్క్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ☛ యాప్ అప్‌డేట్ వచ్చాకే ఈ ఫీచర్ ఫోన్‌లో వస్తుంది.

Read More »

అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ సాయంతో మోసగాళ్ల కొత్త అవతారం

ఒకప్పుడు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ‘స్ఫూఫింగ్‌’(నకిలీల సృష్టి) టెక్నాలజీ ఇప్పుడు మోసగాళ్ల వద్దకూ చేరింది. కేవలం కాల్‌ స్ఫూఫింగ్‌ మాత్రమే కాకుండా మెయిల్‌ స్ఫూఫింగ్‌కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్‌ చేసే వారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్‌ కాల్స్‌ అన్నీ మీ నెంబర్‌ …

Read More »

2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు

2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుకుంటుందని సిస్కో నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని.. 2023 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య 96.6 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడం, అన్ని విషయాలకు ఆన్‌లైన్‌పై ఆధారపడటం వంటి విషయాలతో 2023 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పింది. అటు ఇదే సమయానికి 67 కోట్ల 5జీ కనెక్షన్లు ఉంటాయంది.

Read More »

వైఫై సదుపాయం కొనసాగుతుంది…

దేశ వ్యాప్తంగా ఉన్న 5600 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైని కొనసాగిస్తామని ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ స్పష్టం చేసింది. ఉచిత వైఫై కల్పించే సదుపాయం నుంచి గూగుల్ తప్పుకున్నా పథకం ఆగేది లేదని తేల్చి చెప్పింది. గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామిగా ఉందని.. మిగిలిన స్టేషన్లలో వివిధ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపింది. వాటితో కలిసి నిరంతరం వైఫై సేవలు అందిస్తామని రైల్‌టెల్ ప్రకటించింది.

Read More »

ఎంత ట్రాన్స్‌ఫర్ అయిందో చెబుతుంది…

డిజిటల్ పేమెంట్లలో మనం ఇప్పటి దాకా QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా అవతలి వ్యక్తికి లేదా సంస్థకు డబ్బులు చెల్లిస్తున్నము. చెల్లించాక పేమెంట్ సక్సెస్ అయిన మెసేజ్‌ను చూపిస్తున్నాం. అయితే కొత్తగా మార్కెట్లోకి QR స్కానర్ విత్ స్పీకర్ అందుబాటులోకి వచ్చాయి. మీరు ఎంత పేమెంట్ చేశారు, సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఈ స్పీకర్ బయటకు చెబుతుంది. కస్టమర్లకు, ఓనర్లకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా …

Read More »

ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త యాప్…

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. Pinterest తరహాలో ‘Hobbi’ అనే కొత్త ఫోటో, వీడియో షేరింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ యూజర్లకు మాత్రమే తొలుత ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సంస్థలోని ‘న్యూ ప్రోడక్ట్ ఎక్సపెరిమెంటేషన్’ విభాగం ‘Hobbi’ యాప్‌ను తయారుచేసినట్లు వెల్లడించిన ఫేస్‌బుక్.. ప్రస్తుతం 84 దేశాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చామంది.

Read More »

శాటిలైట్ ఎలా తయారుచేస్తారు?

ప్రపంచీకరణ విస్తరిస్తున్న క్రమంలో టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి అంతరిక్షంలోకి కూడా అడుగుపెడుతున్నాడు. నాసా నుంచి ఇస్రో వరకు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది. అయితే ఈ శాటిలైట్లను ఎలా తయారుచేస్తారు?. ఇవి ఎలా పనిచేస్తాయి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.

Read More »