Breaking News
Home / Sports

Sports

కార్మికులకు ధోని రూ.లక్ష విరాళం…

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. లాక్‌డౌన్ వల్ల నష్టపోతున్న కార్మికులకు రూ.లక్ష విరాళం ఇచ్చాడు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు ధోనీ ఆన్‌లైన్ ద్వారా రూ.లక్ష ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆయన భార్య సాక్షి సింగ్ తెలిపింది. ఈ ఫౌండేషన్ పూణెలోని రోజువారీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందిస్తుంది. ధోనీ ముందుకు రాగానే విరాళాలు పెరుగుతున్నట్లు ఆ ఫౌండేషన్ తెలిపింది.

Read More »

ఒలింపిక్స్‌ను బహిష్కరించిన ఆస్ట్రేలియా…

కరోనా వైరస్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే తమ అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపమని కెనడా తేల్చిచెప్పగా.. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఇదే నిర్ణయం ప్రకటించింది. వైరస్ దృష్ట్యా తమ అథ్లెట్ల బృందాలను టోక్యోకు పంపించలేమని స్పష్టంచేసింది. దీంతో మరిన్ని దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14వేల మందికి పైగా చనిపోయారు.

Read More »

ఐపీఎల్‌పై రేపు తుది నిర్ణయం!

బీసీసీఐ, ఫ్రాంచైజీ ప్రతినిధుల సమావేశం ముంబై: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తుండటం… ఈ మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడం… వెరసి ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ జరుగుతుందా లేదా అనే సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న ఐపీఎల్‌–13 సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు బయటపడటంతో …

Read More »

క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్‌ బాధితుల్లో సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా ఉన్నారు. , జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌తో పలువురు సెలబ్రిటీలకు కరోనా వైరస్ సోకగా.. తాజాగా స్కాట్లాండ్‌కి చెందిన క్రికెటర్ మజిద్ హక్‌కు కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన తొలి క్రికెటర్‌గా అతడు నిలిచాడు. ప్రస్తుతం మజిద్ హక్‌కు ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు

Read More »

స్వీయ నిర్బంధంలోకి కోహ్లీ, అనుష్క

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఈ సందర్భంగా స్వీయ నిర్బంధంలోకి వెళితే కరోనా వైరస్‌ను ఆపగలమని, వ్యాప్తి చెందకుండా నియంత్రించగలమని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తెలిపారు. ఇప్పుడు మనమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాలను అందరు తెలుసుకోవాలన్నారు.

Read More »

భారత ఫుట్‌బాల్ లెజెండ్ కన్నుమూత

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ(83) కన్నుమూశారు. కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఇవాళ కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించారు. భారత్ తరపున 84 మ్యాచ్‌లు ఆడిన ఆయన 65 గోల్స్ చేశారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.

Read More »

ఏ క్రికెటర్ షాట్ మీ ఫేవరెట్?

కొంతమంది క్రికెటర్లు కొట్టే షాట్లు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ‘క్రిక్ ట్రాకర్’ నలుగురు ఆటగాళ్ల ఫేవరెట్ షాట్ల గురించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. సచిన్ ‘స్ట్రైట్ డ్రైవ్’, పాంటింగ్ ‘పుల్ షాట్’, సంగక్కర ‘కవర్ డ్రైవ్’, విలియమ్సన్ ‘బ్యాక్‌ఫుట్ పంచ్’ షాట్‌లో మీకు ఏ షాట్ ఇష్టమని అభిమానులకు ఓ ప్రశ్న వేసింది. దీంతో తమకు ఇష్టమైన షాట్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. …

Read More »

‘మరికొన్ని నెలల్లో ధోనీ రిటైర్మెంట్’

కొద్ది రోజుల క్రితం ధోనీ పునరాగమనం అసాధ్యమని సెహ్వాగ్ కామెంట్ చేయగా.. తాజాగా సునీల్ గవాస్కర్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీని చూడాలని ఉంది. కానీ మళ్లీ అతను ఇండియా జెర్సీలో కనిపించే అవకాశాల్లేవు. భారత జట్టు ధోనీని దాటి ముందుకు వెళ్లిపోయింది. మరికొన్ని నెలల్లో అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని అనుకుంటున్నా’ అని గవాస్కర్ కామెంట్ చేశాడు. ఇక ధోనీ భవితవ్యమేంటో చూడాలి …

Read More »

సంజయ్‌కు బీసీబీ ఆఫర్…

ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్టుల్లో తమ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా నియమించుకునేందుకు అతడిని సంప్రదించింది. ప్రస్తుతం టెస్టుల్లో బంగ్లాకు మాజీ SA క్రికెటర్ నీల్ మెకెంజీ కన్సల్టెంట్‌గా ఉండగా.. వన్డేల్లోనూ కన్సల్టెంట్‌గా ఉండేందుకు నీల్ ఆసక్తి చూపడం లేదు. దీంతో సంజయ్‌ను సంప్రదించగా, అతడి నిర్ణయం ఇంకా చెప్పలేదు.

Read More »

ధోనీ గురించి ఈ రికార్డు తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ T20ల్లో భారత్ తరపున అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని T20 వరల్డ్‌కప్‌ టోర్నీలకు ధోనీ మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఏ ఇతర దేశ ఆటగాడు ఈ రికార్డును నమోదుచేయలేదు. 2007 T20 WCకు నాయకత్వం వహించిన MSD.. 2009, 2010, 2012, 2014, 2016 వరల్డ్‌కప్ టోర్నీలకు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే ఈ ఏడాది జరిగే T20 WCకు …

Read More »