Breaking News
Home / States

States

మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేద్దాం..

మెట్‌పల్లి: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం టీఆర్ఎస్ ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం ఆధ్వర్యంలోని బృందం మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముదాం …

Read More »

మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ విఫలం: ఉత్తమ్‌

నల్గొండ: మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ తీవ్రంగా విఫలమయ్యారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని, సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తెరాస అనేక సార్లు మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి …

Read More »

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏనుగుల దాడులు

చిత్తూరు: జిల్లాలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. యాదమరి మండలం నుంచి బంగారుపాలెం మండలం వైపు ఏనుగుల దాడులు మల్లాయి. బంగారుపాలెం మండలంలోని బండ్ల దొడ్డి, బోడబండ్ల, నాలగాం పలికి తదితర గ్రామాల్లో ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి నాశనం చేస్తున్నాయి. మామిడి, వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో గ్రామాల్లోని ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read More »

ప్రలోభాలు పలు విధాలు

ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రోజుకో రీతిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి రోజు ఆరో వార్డులో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఇంటింటికీ కిలో మాంసం అందించారు. ఇంకో రోజు చికెన్‌తోపాటు శీతలపానీయం బాటిల్‌ పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఓ వార్డులోని ఇళ్ల ముందు 50 గ్రాముల టీపొడి, అర లీటరు పాల ప్యాకెట్‌, అర కిలో చొప్పున చక్కెర, కందిపప్పు, పెసరపప్పు …

Read More »

మందడంలో రోడ్డుపైనే నిరసన

అమరావతి: రాజధాని రైతుల దీక్షలు 33వ రోజుకు చేరాయి. మందడం, వెలగపూడిలో రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. మందడంలో రహదారిపైనే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందడం శివాలయం నుంచి మహిళలు బెజవాడ దుర్గమ్మ సన్నిధికి బయల్దేరారు. మొక్కు తీర్చుకునేందుకు మార్గ మధ్యంలోని గ్రామాల మహిళలతో కలిసి పొంగళ్లతో 13 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమ్మవారిని వేడుకోనున్నారు.

Read More »

విజయనగరంలో పల్స్ పోలియో ప్రారంభం

విజయనగరం: నేడు రాష్ట్రవ్యాప్త పల్స్ పోలియో సందర్భంగా విజయనగరం జిల్లా రాజీవ్ నగర్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలక్టర్ హరి జవహర్ లాల్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Read More »

రాజధానిలో మరో రైతు మృతి

అమరావతి: రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. అమరావతి పరిధిలోని వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి 7 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన అప్పారావు అమరావతి తరలింపుపై గత కొన్నిరోజులుగా ఆందోళనతో ఉన్నారు. దీంతో పాటు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న తన కుమారుడు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తుండటంతో మనోవేదనతోనే అప్పారావు చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు.

Read More »

కర్నూలు జిల్లా: తల్లి కొడుకును ఢీకొన్న రైలు

కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం, తుంగభద్ర రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలు దాటతుండగా తల్లి కొడుకును రైలు ఢీకొంది. కుమారుడు బసవ (18) మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వారు సాతనూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More »

వైస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ

అనంతపురం: జిల్లాలోని పుట్లూరు మండలం, గరుగు చింతలపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భోగతి నారాయణ రెడ్డి, పెద్దరెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Read More »

తిరుమల సమాచారం..

తిరుమలలో భక్తుల రద్ది కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా.. శ్రీవారి టైం స్లాట్, సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 92,429 మంది భక్తులు దర్శించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను ఆలయ అధికారులు ఈ నెల …

Read More »