Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati

Amaravati

కరోనాపై పోరుకు భారీ విరాళాలు

హెరిటేజ్‌ రూ.కోటి, భాష్యం 50 లక్షల వితరణ ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సాయం అమరావతి: కరోనాపై పోరులో తమవంతు సాయంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధులకు రూ.30 లక్షలు చొప్పున, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంల సహాయ నిధికి రూ.10 లక్షలు చొప్పున ఇస్తున్నట్టు పేర్కొంది. ‘మనం ఎన్న డూ చూడని విపత్తును ఎదుర్కొంటున్నాం. ఈ …

Read More »

14 రోజుల తర్వాతే రాష్ట్రంలోకి

ఎవరైనా క్వారంటైన్‌లో ఉండాల్సిందే: సీఎం విదేశాల నుంచి వచ్చిన ప్రతి పదిమందికి ఓ వైద్యుడు నిత్యావసరాలపై ప్రజలు సంతృప్తి చెందాలి ఆ తర్వాతే సమయాన్ని కుదించే ఆలోచన కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాలి డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో లింక్‌ నిత్యావసరాల వాహనాలూ నిలిపేస్తున్నారు దీనిపై డీజీపీ దృష్టి పెట్టాలి: సీఎం ఆదేశాలు అమరావతి: ‘‘ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే భోజనం, వసతి ఏర్పాటుచేయాలి. 14రోజుల క్వారంటైన్‌కు …

Read More »

ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా చర్యలు: మోపిదేవి

అమరావతి: కరోనా వల్ల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు నిలిచాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. ఆక్వా రంగం నష్టపోకుండా సీఎం అనేక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారులతో సీఎం జగన్‌ చర్చలు జరిపారన్నారు. ఏప్రిల్‌ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. రొయ్యల రైతులు నష్టపోకుండా స్థిరమైన ధరలు నిర్ణయించామని తెలిపారు. రైతులకు నష్టం కలిగించే …

Read More »

కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్: కరోనా సోకిందేమోననే భయంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతిచెందాడు. అక్కల వెంకటయ్య(55) HYDలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో రెండురోజుల క్రితం మాచర్ల చేరుకున్నాడు. అప్పటి నుంచి కరోనా సోకిందన్న అనుమానంతో ఉన్న వెంకటయ్య ఇవాళ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.

Read More »

ఏపీకి రూ. 5కోట్లు ఇచ్చిన మేఘా కృష్ణారెడ్డి….

అమరావతి: మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నివారణ కోసం సీఎం సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళాన్ని సీఎం వైఎస్ జగన్‌కు మేఘా సంస్థల అధినేత కృష్ణారెడ్డి అందించారు. గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మేఘా కృష్ణారెడ్డి కలిశారు. సీఎం కేసీఆర్‌కు కృష్ణారెడ్డి రూ.5 కోట్ల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అండగా …

Read More »

ఏపీలోకి వచ్చేవారిని అనుమతించండి…

తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి NOCలతో ఏపీకి వచ్చే వారిని అనుమతించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీకి వచ్చే విద్యార్థులు, ఉద్యోగార్థులను డాక్టర్లతో పరీక్షించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని, లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది. క్వారంటైన్‌లో ఉంచిన వారిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలంది.

Read More »

బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం…

అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ”కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశాం… 24గంటలు …

Read More »

కరోనా వైరస్ నియంత్రణకు జిల్లాకు రూ.2 కోట్లు…

అమరావతి: కరోనా వైరస్‌పై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో సీఎం జగన్ కమిటీని వేశారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ. 2 కోట్లు కేటాయిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read More »

మోదీకి ధన్యవాదాలు…

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘మనస్పూర్తిగా ధన్యవాదాలు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్బీఐ, గౌరవనీయ ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్. ఈ ఆపద సమయంలో ఈఎంఐల చెల్లింపులో వెసులుబాటు కల్పించినందుకు ధన్యవాదాలు’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Read More »

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు…

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు నెలల బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో ఆళ్లనాని, బుగ్గన, బొత్స, మేకతోటి సుచరిత, కన్నబాబులకు చోటు కల్పించింది. ప్రతిరోజు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

Read More »