Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur

Anantapur

అనంతపురంలో మృతదేహాల కలకలం…

అనంతపురం: అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాక్‌పై నాలుగు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మూడు ప్రాంతాల్లో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. కిటిపి వద్ద రెండు మృతదేహాలు లభ్యం కాగా, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు అనుమానాస్పదంగా పడి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

Read More »

ద్విచక్రవాహనం బోల్తా….ఉద్యోగి మృతి…

అనంతపురం: అనంతపురం జిల్లా రూరల్‌ మండలం నిరాచానుపల్లి సమీపంలో ద్విచక్రవాహనం బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన కియా ఉద్యోగి అయినా చిరంజీవి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులు

ఆస్పత్రి బిల్లు రూ.వెయ్యి దాటితే వర్తింపు రూపాయి ఖర్చులేకుండా కంటివైద్యం రెటినోపతికీ ఉచితంగా చికిత్సలు మూడేళ్లలో 5 కోట్ల మందికి పరీక్షలు అవసరమైతే ఉచితంగా కళ్లద్దాలు డయాలసిస్‌, తలసేమియా రోగులకు జనవరి 1 నుంచి 10 వేల పెన్షన్‌ పక్షవాత రోగులకు ఐదేసి వేలిస్తాం మరో 4 రకాల వ్యాధిగ్రస్తులకూ.. కొత్తగా 5 చోట్ల వైద్య కళాశాలలు ఏలూరు, పులివెందుల, పిడుగురాళ్ల, మార్కాపురం, పాడేరుల్లో ఏర్పాటు ప్రభుత్వాస్పత్రుల సమూల ప్రక్షాళన …

Read More »

వైఎస్సార్‌ కంటివెలుగు ప్రచార ఆర్భాటమే…

అనంతపురం: గత ప్రభుత్వ హయాంలో ఈ-ఐ కేంద్రంలో కంటి పరీక్షలు చేశామని వైఎస్సార్‌ కంటివెలుగు ప్రచార ఆర్భాటమేనని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆశావర్కర్లతో కంటి పరీక్షలు నిర్వహించి సాధించేదేమీలేదని తప్పుబట్టారు. ప్రచారం కోసం ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, మోసపూరిత కార్యక్రమాలు చేయొద్దన్నారు. రైతులకు ఇంతవరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Read More »

సభ వద్ద తోపులాట…ఆగ్రహించిన కార్యకర్తలు…

అనంతపురం: వైస్సార్ కంటివెలుగు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనంతపురం రావడంతో వైకాపా శ్రేణులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. బహిరంగ సభ వేదిక వద్ద స్థలం చాలకపోవడంతో పోలీసులు కొందరిని అడ్డుకుని సభాప్రాంగణం బయటే నిలిపివేశారు. …

Read More »

కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సీఎం….

అనంతపురం: ఏపీలో అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశ కంటి వెలుగు పథకాన్ని అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో సమగ్ర పరీక్షలు చేయనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు కళ్లజోళ్లు వైద్య సదుపాయాలు అందించనున్నారు. అంతేకాకుండా జనవరి 1 నుంచి రాష్ట్రంలో …

Read More »

స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని….

అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ అనంతపురంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనకు మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  హెలిపాడ్ వద్ద సీఎం జగన్‌ వద్దకు వెళ్లి స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేదని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును …

Read More »

పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం…

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో జిల్లా కలెక్టర్‌, పార్టీ శ్రేణులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం జగన్‌ అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌ చేరుకోనున్నారు. కాలేజీ మైదానంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు.

Read More »

పామురాయి సమీపంలో రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని పామురాయి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కి చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Read More »

వంతెనపై నుంచి కిందపడ్డ కారు…

అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురంలో రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలును చిక్‌బళ్లాపూర్‌కు చెందిన లక్ష్మీదేవి(57)గా గుర్తించారు.

Read More »