Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 10)

Anantapur

రాయదుర్గంలో కాల్వ వర్సెస్ కాపు రామచంద్రారెడ్డి

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వర్సెస్ కాపు రమచంద్రారెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అమరావతి రాజధానిపై కాల్వ శ్రీనివాసులు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరవుతానంటూ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం చీఫ్ కాపు రామచంద్రారెడ్డి సమాచారం అందించారు. కాగా శాంతిభద్రతలకు విఘాతమంటూ ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాల్వ శ్రీనివాసులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు …

Read More »

విహారయాత్రలో విషాదం…

కదిరి: అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఉత్తర కర్ణాటకలోని మురడేశ్వర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 40 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. సమాచారం అందన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ …

Read More »

జీఎన్‌రావు కమిటీ సీమ వాసుల కల నెరవేర్చింది…

అనంతపురం: జీఎన్‌రావు కమిటీ నివేదిక ప్రకారం రాయలసీమ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతుందని మంత్రి శంకరనారయణ తెలిపారు. గత ప్రభుత్వం రాయలసీమ ప్రాంత వాసులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వెల్లడించారు. దీనికి జీఎన్‌రావు కమిటీ నివేదికే ఆదర్శం అన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టిన రైతులు ఆందోళన వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.

Read More »

రైతుపై ఎలుగుబంట్ల దాడి

అనంతపురం: ఓ రైతు తన పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా.. ఒక్కసారిగా మూడు ఎలుగు బంట్లు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం మేలుకుంట గ్రామంలో జరిగింది. మేలుకుంటకు చెందిన దాసరి నరసింహలు అనే రైతు తోటలో మోటార్ ఆన్ చేస్తుండగా ఒకేసారి మూడు ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ దాడిలో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం …

Read More »

అప్పుల బాధతో నేతన్న బలవన్మరణం

ధర్మవరం : అప్పులబాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో బుధవారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు…పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన మాదన దామోదర్‌ (38) సొంతమగ్గాలు వేసి నష్టం రావడంతో రూ.10 లక్షలకుపైగా అప్పులు చేశాడు. ఈపరిస్థితుల్లో కూలీమగ్గం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడం, కుటుంబ బాధ్యతలతో తీవ్ర మధనపడేవాడని బంధువులు తెలిపారు. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More »

చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్…

అనంతపురం: మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైసీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి …

Read More »

దివాకర్ ట్రావెల్స్‌కు మరోసారి షాక్ ఇచ్చిన ఆర్టీఏ

అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులను అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. కాగా, గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ బస్సులను అక్రమంగా సీజ్ చేశారంటూ జేసీ …

Read More »

పశువుల మేత విషయంలో తన్నుకున్న వైసీపీ కార్యకర్తలు

అనంతపురం: బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ ఆవరణలో వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పశువుల మేత విషయంలో వైసీపీ నేతలు ఆదినారాయణ, సాకే అంజి వర్గీయులు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పరస్పరం దాడులకు దిగారు. ఎనిమిది మందిపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అనంతపురం: పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని రజిత పురుగుల మందు తాగి.. ప్రార్థన చేస్తున్న సమయంలో కింద పడిపోయింది. దీంతో గమనించిన ఉపాధ్యాయులు రజితను హుటాహుటిన గాండ్ల పెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రజిత పరిస్థితి విషమంగా ఉండటంతో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read More »

ఆ పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయి

అనంతపురం: సీఏఏపై అవగాహన కల్పించేందుకు జిల్లాల్లో పర్యటించనున్నట్లు బీజేపీ నేత దేవ్‌ధర్ తెలిపారు. ప్రజలు తిరస్కరించిన పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. దేశం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. సీఏఏకు మద్దతు తెలిపిన జగన్‌, చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినవారికి పౌరసత్వం ఇచ్చేది లేదని దేవ్‌ధర్ స్పష్టం చేశారు.

Read More »