Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 19)

Anantapur

ఆయన గందరగోళ పరిపాలన చేస్తున్నారు…

అనంతపురం: జగన్‌ గందరగోళ పరిపాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్‌ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలన్నారు. విభజన హామీలపై మాట్లాడాలని.. జగన్‌ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఇసుక సమస్య పరిష్కారం కాలేదని.. పనుల్లేక లక్షల మంది రోడ్డున పడ్డారన్నారు. రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏబీఎన్‌ ఛానెల్‌ను ఎందుకు బ్యాన్‌ చేశారో చెప్పాలన్నారు. ట్రైబ్యునల్‌ చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం …

Read More »

రోడ్డుపై నీరు వదిలినందుకు రూ.2 లక్షలు జరిమానా…

రాయదుర్గం: జాతీయ రహదారిలో రోడ్డుపైకి వ్యర్థనీటిని వదిలినందుకు రూ. 2 లక్షల జరిమానాను జీహెచ్‌ఎంసీ అధికారులు విధించారు. దాబా కూడలి నుంచి  వెళ్లే రోడ్డులో పక్వాన్‌ హోటల్‌ ఎదురుగా నందన వెంచర్స్‌ సెల్లార్‌ నిర్మాణం చేస్తున్నారు. సెల్లార్‌లో పేరుకుపోయిన వ్యర్థ నీటిని పైప్‌లైన్‌ ద్వారా రోడ్డుపైకి వదిలేశారు. అసలే రోడ్డుపై ఫ్లైఓవర్‌ నిర్మాణం చేస్తుండడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ఈనేపథ్యంలో వ్యర్థనీటిని రోడ్డుపైకి వదిలినందుకు ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు …

Read More »

జలదిగ్బంధంలో అనంతపురం జిల్లా ప్రజలు…

అనంతపురం : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం పెద్దవడుగూరు మండలంలోని రోడ్లన్నీ జలమయమవ్వడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కొన్నిచోట్ల ఇళ్లు కూలిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

Read More »

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు…

గుంతకల్లు/అనంతపురం : దసరా ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు మీదుగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌ (నెం. 06051) ప్రత్యేక రైలును అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9 తేదీలలో నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు శనివారాలలో రాత్రి 8-10 గంటలకు చెన్నైలో బయలుదేరి అహ్మదాబాద్‌కు సోమవారం తెల్లవారుజాము 4-10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు …

Read More »

రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయడం మానాలి…

అనంతపురం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అరాచకాలకు పాల్పడితే అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఎదుటి మనిషిపై బురద చల్లడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ ద్వారా నిధులను తెప్పించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.

Read More »