Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 3)

Anantapur

ఎస్సీలకు అన్యాయం చేశారంటూ ధర్నా

కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటుంటే.. మరో వైపు టిక్కెట్ల వివాదాలతో పార్టీలో​ అసంతృప్తి రగులుతోంది. తనకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం టీడీపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆర్కే రాజు ధర్నాకు దిగారు. టీడీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమా మహేశ్వర నాయుడు ఏకపక్షంగా …

Read More »

లిఫ్టులో ఇరుక్కుపోయిన వైఎస్సార్‌సీపీ నేత

అనంతపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోయారు. శ్రీ సెవన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం కిందకు వెళ్తుండగా.. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తలు లిఫ్టును ధ్వంసం చేసి విశ్వేశ్వరరెడ్డిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.

Read More »

ఏపి అభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కర్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు …

Read More »

ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయం

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయమని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైళ్లు, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. బీసీలకు మేలు చేసేందుకే జగన్‌ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లను …

Read More »

సర్వజనాస్పత్రిలో డబ్బు జబ్బు

అనంతపురం: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారే సర్వజనాస్పత్రికి వస్తారు. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ సరాసరి 25 ప్రసవాలు జరుగుతుంటాయి. అధిక శాతం బాలింతల నుంచి లేబర్‌ వార్డు క్లాస్‌–4 సిబ్బంది రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రూపులుగా ఏర్పడి బాలింతల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. మగ బిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ పుడితే రూ.1,000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే బిడ్డను ఇవ్వరు. డబ్బులిచ్చుకోలేని వారికి …

Read More »

సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం

అనంతపురం: ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 97 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,839 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 33,709 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో అధికారులు కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. లైట్లు లేకపోవడంతో …

Read More »

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం

తాడిపత్రి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే తాము పోటీలో ఉంటామన్నారు. స్థానిక సంస్థల …

Read More »

తల్లిదండ్రుల మృతి.. అన్నీ తానై..

అనంతపురం, తాడిపత్రి : రెండేళ్ల క్రితం వరకు ఆ కుటుంబం ఆనందోత్సాహాలతో గడిపింది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు… ఎంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది. ఫలితంగా తల్లిదండ్రుల నీడన ఆడుకోవాల్సిన వయస్సులో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఆదుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. అయినవాళ్లందరూ కాదని అంటే ఎటు పోవాలో అర్థం కాలేదు. చివరకు ఏడు పదుల వయస్సులో ఉన్న నానమ్మ అన్నీ తానై ముందుకు వచ్చింది. …

Read More »

ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

అనంతపురం, ఓడీ చెరువు: మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి తప్పిపోయిందంటూ బాలిక తండ్రి శివానంద గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ లింగన్న తెలిపిన వివరాలమేరకు.. ఓడీ చెరువు మండలం నవాబుకోటకు చెందిన శివానంద కుమార్తె స్నేహలత కళాశాలకు వెళ్తున్నానని అదే గ్రామానికి చెందిన బాబ్‌జాన్‌ అటోలో ఈ నెల 24న వెళ్లింది. సాయంత్రం కళాశాల నుంచి …

Read More »

అనంతపురంలో పిచ్చికుక్క స్వైరవిహారం…

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. అటవీ కార్యాలయం వద్ద కుక్క దాడి చేయడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. రహదారి పక్కన వాకింగ్ చేసే వారితో పాటు కూలీ పనులకు వెళ్తున్న వారిని కరిచింది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read More »