Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 4)

Anantapur

అనంతపురం‌లో రోడ్డు ప్రమాదం..

పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు తెలుస్తోంది. మృతుడు మామడూరు గ్రామానికి చెందిన నారాయణస్వామిగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తులను  ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read More »

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..

అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. అనంతపురం జిల్లా అమడగూరు మండలం మొహమ్మదాబాద్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జవకల్ గ్రామానికి చెందిన నాగభూషణంతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు.

Read More »

ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత

అనంతపురం: అమరావతిలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత ఎంపీ నందిగం సురేష్ పై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. బాబు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే బాబు ఆరాటపడుతున్నాడని …

Read More »

వ్యక్తి అనుమానాస్పద మృతి

అనంతపురం: అనంతపురం జిల్లాలోని శారదానగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో కృష్ణమూర్తి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే కృష్ణమూర్తిది హత్యే అని భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని స్వగ్రామం బత్తలపల్లి మండలం రాఘవన్‌పల్లిగా తెలుస్తోంది.

Read More »

అనంతపురంలో నిలిచిన ట్రావెల్స్ బస్సు…

అనంతపురం: బెంగుళూరు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎస్సారెస్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిలోపం తలెత్తింది. దీంతో పెనుకొండ వద్ద బస్సు నిలిచిపోయింది. కాగా బస్సు నిలిచిపోవడంపై ఎస్సారెస్ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు రాత్రంతా ఇబ్బందులకు గురయ్యారు.

Read More »

జేసీ మరో చీటింగ్‌ వ్యవహారం

అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్‌ వ్యవహారం బయటపడింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 10 లారీలను అడ్డదారిలో అనంతపురంలో విక్రయించారు. స్క్రాప్ కింద ఒక్కో లారీని రూ.6లక్షలకు కొనుగోలు చేసి రూ.23 లక్షలకు విక్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని …

Read More »

ప్రభుత్వ హాస్పిటల్ అధికారుల బాధ్యతారాహిత్యం

అనంతపురం: తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెల్లడించింది. దీంతో తలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్‌ అనీమియా, ఎలిఫాంటియాసిస్‌(బోదకాలు), మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, కండరాల బలహీనత, యాక్సిడెంట్‌కు గురై(చక్రాల కుర్చీ/మంచానికి పరిమితమైన వారు), కుష్టు రోగులు(బహుళ వైకల్యం), కిడ్నీ, కాలేయం, గుండె మార్పి జరిగిన వారికి మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ మంజూరు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్‌ …

Read More »

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

ఉరవకొండ: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతాండాకు చెందిన ఆంజనేయులు నాయక్‌(25) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని ఆంజనేయులు వ్యవసాయం చేశాడు. పంటలు పండకపోవడంతో సాగు కోసం రూ.8 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read More »

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 70,599 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Read More »

బాబు అవినీతిపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తా…

అనంతపురం: చంద్రబాబు అవినీతిపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి ఐటీ దాడుల్లో బట్టబయలైందన్నారు. చంద్రబాబు అండ్‌ కో జరిపిన రూ.2వేల కోట్లు అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని విమర్శించారు. ఈ మేరకు బాబు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన …

Read More »