Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 5)

Anantapur

అనంతపురంలో విషాదం…

అనంతపురం: ఉరవకొండలో విషాదం చోటుచేసుకుంది. టెన్త్‌ విద్యార్థిని శాంతిశ్రీని ఉన్మాది హనుమంతు వేధింపులకు గురిచేశాడు. వేధింపులు తాళలేక శాంతిశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేధింపులపై గతంలోనే శాంతిశ్రీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమంతును పోలీసులు స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా  మార్పు రాలేదు. ఫలితంగా నిండు ప్రాణం బలైపోయింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడ్ని శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ …

Read More »

మంత్రి శంకర్ నారాయణకు చేదు అనుభవం…

అనంతపురం: సోమందేపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి శంకర్‌నారాయణ కారును సాగు రైతులు అడ్డుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని అధికారంలోకి రాగానే మాట తప్పారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములకు పట్టాలు ఇప్పించకుంటే ఆత్మహత్యలకైనా సిద్ధంగా ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read More »

రమణారెడ్డి ఎక్కడ?

అనంతపురం: జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతోంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన మూన్నెళ్లవుతున్నా.. విధుల్లో చేరకపోవడమే ఇందుకు కారణమైంది. కూడేరు ఎంపీడీఓగా పని చేస్తున్న రమణారెడ్డి 2019 ఆగస్టు 1న డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 19న సెలవుపై వెళ్లారు. ముందుగా ఐదు రోజులు సెలవు పెట్టినా తర్వాత సెలవును పొడిగించుకున్నారు. జిల్లా పరిషత్‌లో ఈ పోస్టు …

Read More »

భూముల పరిశీలనకు సిద్దమైన రామకృష్ణ

అనంతపురం: కియా పరిశ్రమ.. భూములు పరిశీలనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిద్దమయ్యారు. అయితే ఆయనను కియా పరిశ్రమ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు ఫంక్షన్స్‌కు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డిని రామకృష్ణ ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో డీఎస్పీ వీర రాఘవ రెడ్డితో ఈ విషయమై  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,  జిల్లా కార్యదర్శి జగదీష్ చర్చిస్తున్నారు.

Read More »

పుట్టపర్తిలో ధోని

అనంతపురం: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహీంద్రసింగ్‌ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్‌ డాక్టర్‌ ముత్తు.. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్‌ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన …

Read More »

ఆర్టీఏలో ‘మోనార్క్‌’

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు రవాణాశాఖలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి దారితప్పిన ఓ ఉద్యోగిని చేరదీశాడు. దీని వెనుక అసలు కథ చాలానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సదరు అధికారి అవసరాలన్నీ ఆ కానిస్టేబులే చూసుకుంటున్నాడు. గతంలో ఇతని ఉచ్చులో పడిన అధికారులు బలి పశువులయ్యారు. ఓ షోరూంలో పనిచేసే మహిళతో అక్రమ వ్యవహారంలో పడి ఓ అధికారి విలవిలలాడిపోయారు. రూ. లక్షలు చెల్లించి …

Read More »

కియా ప్లాంట్‌ను తరలించడం లేదు: కియా ఎండీ

అనంతపురం: అనంతపురంలోని కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై కియా ఎండీ హాన్ వు పార్క్ స్పందించారు. అనంతపురం ఫ్యాక్టరీ నుంచే ప్రపంచస్థాయి వాహనాలు తయారుచేస్తామని, కియా కార్ల పరిశ్రమ తరలివెళ్తుందన్న వార్తల్లో నిజం లేదన్నారు. అనంతపురంలోనే తమ పరిశ్రమను కొనసాగిస్తామన్నారు. కాగా కియాను తరలిస్తున్నారంటూ నేషనల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

Read More »

జేసీ సోదరులపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు…

అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల అవినీతి చిట్టా పెరుగుతోందని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. జేసీ బ్రదర్స్‌ వాహనాల ఎన్‌వోసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జేసీ వ్యాపారాల్లో అనుచరులు, వంట మనుషులే బినామీలుగా ఉన్నారని ఆరోపించారు. జేసీ తాడిపత్రిలో మట్కా డాన్ విడిపించేందుకు ధర్నా చేశాడని, జేసీ బినామీ వ్యాపారం బయట పడతానని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు.

Read More »

ఆ వార్తలు అవాస్తవం: కియా

అనంతపురం : అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కియా యాజమాన్యం ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్న కియా మోటార్స్.. తమ ప్లాంట్‌లో 85శాతం స్థానిక యువతే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపింది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది.

Read More »

తమిళనాడుకు వెళ్లనున్న కియా మోటార్స్?

అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలివెళ్లనున్నట్లు సమాచారం. మొత్తం ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించాలని కియా మోటార్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తుండగా.. ఇటీవల మారిన ప్రభుత్వ పాలసీల వల్ల కియా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.13వేల కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి కానుండగా.. త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Read More »