Breaking News
Home / States / Andhra Pradesh / Chittor

Chittor

నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నేడు మలయప్ప స్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజసం కార్యక్రమాన్ని ఆలయ అర్బకులు నిర్వహించనున్నారు. రేపు కల్యాణోత్సవం సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం శ్రీవారికి ఏకాంతంగానే టీటీడీ పూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం భక్తులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Read More »

శ్రీవారి ఆలయంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు: ఈవో

తిరుమల: శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్ అన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. శ్రీవారికి అన్ని కైంకర్యాలను శాస్త్రోక్తంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా నేపధ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇచ్చామని ,నిత్యావసర విభాగాల ఉద్యోగులను మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పారు. పద్మావతి ఆసుపత్రిలో కరోనా చికిత్సకు వైద్య పరికరాల కోసం 19 కోట్లు విడుదల …

Read More »

తిరుపతిలో ఆదివారం మాంసం దుకాణాలు బంద్

తిరుపతి: నగరంలో ఆదివారం చికెన్, మటన్ దుకాణాలు బంద్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం.. 11 డివిజన్‌లలో రెడ్ జోన్లు నమోదు కావడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఈ ఒక్కరోజు చికెన్, మటన్ దుకాణాలు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Read More »

లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వైసీపీ నేతలు…

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె పట్టణంలో వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదు. రూ.1000 లు పంపిణీ కార్యక్రమంలో లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా ముఖానికి మాస్కు, భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు వేసుకొచ్చిన లబ్దిదారుల‌ మాస్కులు తీయించి మరీ నగదు పంపిణీ చేస్తూ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సమాచారం.

Read More »

ఏపీలో మరో కరోనా కేసు

ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తిరుపతిలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133కి చేరుకుంది. కాగా ఇంకా 493 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.

Read More »

డ్వాక్రా రుణాల కంతు చెల్లింపుపై స్పష్టత రావాలి: డీఆర్డీఏ పీడీ

చిత్తూరు: డ్వాక్రా రుణాల కంతు చెల్లింపుపై స్పష్టత రావాల్సి ఉందని డీఆర్డీఏ పీడీ మురళి తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దాంతో డ్వాక్రా మహిళలు కూడా తమకు ఈ అవకాశం వర్తిస్తుందని భావిస్తున్నారు. దీనిపై పీడీని సంప్రదించగా.. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదన్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Read More »

కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతికి ఫస్ట్‌ ర్యాంక్‌

తిరుపతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్‌సిటీ మిషన్‌ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి మొదటి స్థానం సాధించింది. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాలతో పోలిస్తే స్మార్ట్‌సిటీల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయని స్మార్ట్‌సిటీ మిషన్‌ తన నివేదికలో కితాబునిచ్చింది. అందులోనూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ నగరాల పనితీరును బట్టి మూడు గ్రేడ్‌లుగా విభజించి అక్కడి సేవలను పరిశీలించి …

Read More »

శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

తిరుమల: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాల నిలుపుదలను ఏప్రిల్‌ 14వ వరకు పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తొలుత మార్చి 20 నుంచి 27 వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేసి భక్తులెవ్వరు తిరుమలకు రాకుండా ఘాట్‌రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత 31 వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. తాజాగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఉండడంతో శ్రీవారి దర్శనాలను కూడా అప్పటివరకు నిలుపుదల చేస్తున్నట్టు …

Read More »

నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు

చిత్తూరు: నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయల మార్కెట్లకు అనుమతి ఇచ్చారు. నిత్యావసర వస్తువులను హోం డెలివరీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష తెలిపారు. ఉదయం 4 నుండి 8 గంటల వరకే పాల సరఫరా ఉంటుందన్నారు. అలాగే ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీఎం ఫిల్లింగ్‌ వెహికల్స్‌కు అనుమతి ఇచ్చారు.

Read More »

శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారం….

తిరుమల: శ్రీవారి ఆలయంపై సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారంపై ఆలయ పెద్ద జియ్యంగార్లు స్పందించారు. అన్ని సేవలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని పెద్ద జియ్యర్‌ రామానుజాచార్యులు తెలిపారు. స్వామివారికి శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పణ జరుగుతోందని చెప్పారు. ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే అని జియ్యంగార్లు స్పష్టం చేశారు.

Read More »