Breaking News
Home / States / Andhra Pradesh / East Godavari

East Godavari

తేజశ్వినిని పరామర్శించిన డిప్యూటీ సీఎం…

ఏలూరు: ప్రేమోన్మాది సుధాకర్‌రెడ్డి దాడిలో గాయపడ్డ విద్యార్థిని తేజశ్వినిని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని పరామర్శించారు. తేజశ్విని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Read More »

అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు మృతి….

తూర్పుగోదావరి: శుక్రవారం అడ్డతీగల మండలం సీతారామరాజు కాలనీకి చెందిన కారు గౌరీ, కిత్సల లింగారెడ్డి ఇరువురు మేకలను మేపడానికి అడవికి వెళ్లి వెళ్లారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం అడ్డతీగల, వేట మామిడి గ్రామాల మధ్య అడవి ప్రాంతంలో వెతకారు. అక్కడ విగత జీవులుగా పడి ఉండటం చూసిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించి, …

Read More »

బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం…

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులకు మళ్లీ అంతరాయం కలిగింది. లంగర్ కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలేసింది. బోటులోనే మృతదేహాలు ఉంటాయని ఈతగాళ్లు బోటు దగ్గరికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే గజ ఈతగాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారితో మాట్లాడేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మృతదేహాలను గుర్తించారు. మరో 15 …

Read More »

5వ రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభం…

కచ్చులూరు: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఐదో రోజు బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. రోప్ లు వేయడంలో ధర్మాడి సత్యం బృందం మరోసారి విఫలమైంది. లంగర్ వేసే డీప్ వాటర్ డ్రైవర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరిలో 50 అడుగుల లోతులో బోటు ఉంది.

Read More »

సీఎం జగన్ మనసున్న నాయకుడు…

రాజోలు: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రవేశ పెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఆటో డ్రైవర్లతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ …

Read More »

50 అడుగుల లోతులో బోటు…

తూర్పుగోదావరి జిల్లా: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించిన విషయం తెలిసిందే. నిన్న బోటు రెయిలింగ్‌ను బయటకు తీసిన ఆ బృందం తమ ప్రయత్నాలను ఈరోజు కూడా కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. 50 అడుగుల లోతులో రాయల్ వశిష్ట బోటు ఉన్నట్లు వెల్లడించారు. …

Read More »

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్…

కాకినాడ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు రూ.25 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరు చేసి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడానికి కరప వచ్చిన సీఎం జగన్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పట్టణానికి చెందిన ఎం.నందిని కాలేయవ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోందని తెలియజేశారు. అప్పట్లో సానుకూలంగా జగన్‌ స్పందించారు. …

Read More »

గ్యాస్‌ లీకేజ్‌తో కోనసీమ వాసులు భయాందోళన….

రాజోలు: మల్కిపురం మండలం తూర్పుపాలెంలోని పంట పొలంలో ఓఎన్జీసీ పైప్‌లైన్‌ నుండి కృడాయిల్‌తో కూడిన గ్యాస్‌ లీక్‌ అవడంతో గ్రామస్థులు భయందోళనకు గురైయ్యారు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే గ్రామస్థులు గ్యాస్‌ లీకేజీని చూసి స్థానిక మోరి జీసీఎస్‌కు సమాచారాన్ని అందించారు. అప్పటికే పంట పొలల్లో గ్యాస్‌ లీకేజ్‌ ప్రభావం అలల రూపంలో ఎగసిపడుతుంది. స్థానిక ఒఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి బావుల వద్ద ఉన్న వాల్వ్‌ల ఉధృతిని …

Read More »

బోటు వెలికితీత పనులలో పురోగతి….

రాజమండ్రి: కచ్చులూరు బోటు ఆపరేషన్‌లో పురోగతి సాధించారు. గోదావరిలో బోటును గుర్తించి ధర్మాడి సత్యం బృందం లంగర్లు వేసింది. రోప్‌తో లాగే ప్రయత్నంలో బోటు రెయిలింగ్ బయటికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందడం వద్ద గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గజ ఈతగాడైన ధర్మాడి సత్యం బృందం పొక్లెయిన్‌, భారీ లంగరు, 3000 అడుగుల ఇనుప రోప్‌తో …

Read More »

ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించాలి….

మలికిపురం: పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్‌ వస్తువులను నిర్మూలించాలంటూ.. మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో గ్రామ వాలంటీర్లు గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. పాలిథీన్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగాలు పర్యావరణం పాలిట శాపంగా మారాయని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అలాంటి ప్లాస్టిక్‌ ను ఉపయోగించకూడదంటూ.. నినాదాలు చేశారు.

Read More »