Breaking News

Guntur

గుంటూరులో ప్రేమ పేరుతో మోసం

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. మల్లికార్జునరావు అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లికార్జునరావు హెచ్చార్డీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, యువతి అటెండర్‌గా పనిచేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్లికార్జునరావు స్వస్థలం నరసరావుపేట కాగా, యువతి బాపట్ల ప్యాడిసన్‌పేట వాసి.

Read More »

పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటనలో అపశ్రుతి

బైకు ర్యాలీలో కాలు విరిగిన జన సైనికుడు పెదవడ్లపూడి/గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన సందర్భంగా జరిగిన ద్విచక్రవాహన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామానికి చెందిన ఎ.వినయ్‌కుమార్‌ తోటి కార్యకర్తలతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీలో వస్తుండగా పెదవడ్లపూడి ఫైఓవర్‌ బ్రిడ్డి వద్దకు రాగానే అదుపుతప్పి పడిపోయాడు. ర్యాలీలో పాల్గొన్న మరో కార్యకర్త బైకు వినయ్‌కుమార్‌ కాలిపై వెళ్లడంతో కాలు విరిగి ఎముక …

Read More »

అవినీతిని భోగి మంటల్లో దహిద్దాం

రోడ్లపైకి వచ్చి ఉద్యమించండి అవినీతిని భోగి మంటల్లో దహిద్దాం నేను తప్పుచేసినా చొక్కాపట్టుకోవాలి నాకు ఓటు వేస్తే కంఠం కోసిస్తా 2 వేల పెన్షన్‌, 25 కిలోల బియ్యం కాదు.. పాతికేళ్ల బంగారు భవిష్యత్‌ కావాలి పెదరావూరు సంక్రాంతి సంబరాల్లో పవన్‌ గుంటూరు: ‘యువత పోరాడేది ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌లో కాదు.. రోడ్లపైకి వచ్చి అవినీతిపై ఉద్యమించాలి. ఈ చలికాలంలో ఎక్కడ వీలైతే అక్కడ చర్చించాలి. ఓట్ల కోసం వచ్చే …

Read More »

సోషల్ మీడియాపై పవన్ హాట్ కామెంట్స్

తెనాలి: తాను పదవుల కోసం రాలేదని.. దోపిడీకి వ్యతిరేకంగా వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా’ అంటూ కార్యకర్తలనుద్దేశించి ప్రశ్నించారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన జనసేనాని.. పెదరావూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2019 మన భావజాలానికి పరీక్షా సమయం. ఆలోచించుకోండి. ఒక్క అడుగు వేశాను. పది అడుగులు తోడయ్యాయి. ఇంకో అడుగువేద్దాం. …

Read More »

17 నుంచి ‘మీసేవ’ కేంద్రాల సమ్మె

నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన రాష్ట్ర సంఘం ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ రాష్ట్రవ్యాప్తంగా 9,020 మీసేవ కేంద్రాలు రాయవరం (ప్రత్తిపాడు): ఈ నెల 17 నుంచి ‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకులు నిరవధిక సమ్మె చేపట్టాలని మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చాలీచాలని ఆదాయంతో, మీసేవ కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో విధిలేక సమ్మెబాట పడుతున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 11,054 మీసేవ కేంద్రాలను దశలవారీగా …

Read More »

సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్‌

దుగ్గిరాల: దుగ్గిరాల-1 సేవా ట్రస్టు(దోస్త్‌) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో రూ.4లక్షలతో నిర్మించిన నడక మార్గాన్ని కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌(సీసీఎల్‌) ఛైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌ కలసి ఆయన‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దోస్త్‌ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని మండలంలోని …

Read More »

పిడుగురాళ్లలో భూప్రకంపనలు..

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో శనివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కాసేపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Read More »

రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం సంక్రాంతి కానుక

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. సరుకుల పంపిణీ కమీషన్‌ 75 పైసల నుంచి రూపాయికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌ ద్వారా 29 వేల మంది రేషన్‌ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గతేడాది చంద్రన్న కానుకల కమీషన్‌ రూ.5 నుంచి రూ.10కి పెంచామని గుర్తుచేశారు. కార్డుదారులకు కిలో బియ్యం రూపాయికే ఇస్తున్నామన్నారు. ఆ రూపాయి డీలర్ల …

Read More »

‘జగన్…దమ్ముంటే కేంద్రంతో పోరాడు లేదా మాతో కలిసి రా’

గుంటూరు: చంద్రబాబుపై జగన్ వేసిన పుస్తకాన్ని భోగి మంటల్లో వేసుకోవాల్సిందే అని మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని తాము వేస్తే….దానికి కౌంటర్‌గా జగన్ ఈ పుస్తకాన్ని పంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌కు….తమరు చెబుతున్న అవినీతి లెక్కలకు ఎక్కడా పొంతన లేదన్నారు. జగన్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలని, లేకపోతే తమతో కలసి పోరాటానికి రావాలని మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్ విసిరారు.

Read More »

ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై కారులో చెలరేగిన మంటలు..పరుగులు తీసిన జనం

గుంటూరు: మంగళగిరి నేషనల్ హైవే‌ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై షిఫ్ట్ డిజైర్ కారు అగ్నికి ఆహుతయింది. విజయవాడ వెళ్తున్న మారుతీ కారు.. గుంటూరు సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఐదుగురు ప్రయాణికులు కారు నుంచి దిగిపోయారు. అయితే కారు డ్రైవర్ కాలుకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేసు నమోదు చేసిన …

Read More »