Breaking News
Home / States / Andhra Pradesh / Kurnool

Kurnool

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి….

కర్నూలు: కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 6,97,036 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 7,48,168 క్యూసెక్కుల వరద నీటిని ఔట్‌ఫ్లో ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.10 అడుగులు ఉంది.

Read More »

దారుణ హత్యకు గురైన పశువుల కాపరి

కర్నూలు: కర్నూలు జిల్లా గడివేముల మండలంలో ఎల్.కె తండాలోని పశువుల కాపరి వెంకటకృష్ణను దుండగులు దారుణంగా గొడ్డలితో నరికి చంపడంతో స్థానికంగా పెను సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

వరద ఉధృతికి 10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం జలాశయంలో నీటి ప్రవాహం విపరీతంగా పెరుగుతుండడంతో ఆ ప్రాజెక్ట్ వద్ద 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 7.89 లక్షలుగా ఉండగా ఔట్‌ఫ్లో 8.52 లక్షల క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 196.5 టీఎంసీలకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.6 అడుగులకు చేరుకుంది.

Read More »

మాజీ మేయర్ వినూత్న నిరసన

కర్నూలు: అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బంగి అనంతయ్య భిక్షాటన చేస్తూ అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు.

Read More »

వరద ఉధృతితో కొనసాగుతున్న జల విద్యుత్

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో- 8.68లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో- 6.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 878.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు, ప్రస్తుతం 181 టీఎంసీలు. భూగర్భ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Read More »

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

కర్నూలు: ఆళ్లగడ్డ పట్టణ సమీపంలో 40వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రులంతా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో చదువుకుంటూ దర్శనార్థం తిరుపతికి …

Read More »

తుంగభద్ర జలాశయానికి భారీ వరద

కర్నూలు/హాలహర్వి: తుంగభద్ర జలాశయానికి రికార్డు స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,14,114 క్యూసెక్కులు రావడంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. రోజుకు 10 టీఎంసీల వరద చేరుతుండటంతో మరో రెండు రోజులు ఇన్‌ఫ్లో కొనసాగితే తుంగభద్ర జలాశయానికి పూర్తి స్థాయిలో 100 టీఎంసీలు రావడం ఖాయమని బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉంది.

Read More »

శ్రీశైలం గేట్లు ఎత్తిన ఇరు రాష్ట్రాల మంత్రులు…

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ఇరు రాష్ట్రాల మంత్రులు రిజర్వాయర్‌ గేట్లు ఎత్తారు. ఏపీ నుంచి మంత్రి అనిల్‌కుమార్‌, తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గేట్లు ఎత్తారు. ఈ సీజన్‌లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలను దాటి  శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో  జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం …

Read More »

జలాశయం వద్ద నీటిని విడుదల చేయనున్న మంత్రి

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది. దీంతో సాయంత్రం 5 గంటలకు ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం …

Read More »

శ్రీశైలానికి భారీగా వరద నీరు…

శ్రీశైలం:ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధికమొత్తంలో వచ్చి చేరుతోంది.ఎగువ నుంచి 3,58,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.80 అడుగులకు చేరుకుంది. జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 181.83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు విడుదల …

Read More »