Breaking News
Home / States / Andhra Pradesh / Prakasam

Prakasam

ఫోర్టరీ కేసులో డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్…

కందుకూరు: మహేశ్వరం మండలం, తుమ్మలూరు గ్రామానికి చెందిన కావలి యశోద, భర్త వెంకటయ్య పేరున 239 సర్వే నంబర్‌లో 16 ఎకరాలు, 240లో 10ఎకరాలు, 250లో 8ఎకరాలు, 251లో 6 ఎకరాలు, మొత్తం 40 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై వివాదం ఉండడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ భూమికి సంబంధించి ఇనాం కావడంతో ఓఆర్‌సీ తీసుకోవల్సి ఉండడంతో యాచారం మండలానికి చెందిన కేశమోని వెంకటయ్య, నోముల గ్రామానికి …

Read More »

ప్రకాశంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య…

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి మొదటి సంవత్సరం విద్యార్థిని బి.లహరి ప్రియ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. లహరి ఆత్మహత్యతో ఆమె స్వగ్రామమైన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో విషాదం నెలకొంది. లహరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More »

చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

ప్రకాశం (అద్దంకి) : చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.  నర్రావారిపాలెం సమీపంలోని స్మశాన వాటిక వద్ద చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read More »

ఆ పథకం లబ్ధిదారుల జాబితాలో మంత్రి పేరు…

ప్రకాశం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరిట 94 సెంట్ల భూమి, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో 19 ఎకరాల భూమి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో మంత్రి సురేష్ పేరు కూడా ఉండటం విశేషం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐటీ పరిధిలో ఉన్నవారికి రైతు భరోసా పథకం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. …

Read More »

ప్రకాశం జిల్లాలో మంత్రి పర్యటన…

ప్రకాశం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని మంత్రి సురేష్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

విప్లవకారుడికి నివాళులర్పించిన డివైఎఫ్‌ఐ….

ప్రకాశం : విప్లవకారుడు యూత్‌ ఐకాన్‌ డాక్టర్‌ ” చెగువేరా ” 51వ వర్థంతిని పురస్కరించుకొని చీరాల డివైఎఫ్‌ఐ కార్యాలయంలో డివైఎఫ్‌ఐ నాయకులు చెగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శక్తివంతమైన నాయకుడిగా చెగువేరా అందించిన సేవలను స్మరించుకున్నారు.

Read More »

ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్‌!…

ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్‌ లభించింది. కటాఫ్‌ 5 మార్కులు తగ్గించడంతో వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియలో రోస్టర్‌ పాయింట్ల విడదీత పొరపాట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరిలో మార్కులు సాధించికపోయినా రిజర్వేషన్‌ కేటగిరిలో ఉద్యోగాలు …

Read More »

అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి…

ప్రకాశం : జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ.. వేటపాలెంలోని ఓరుగంటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో, వేటపాలెం తహశీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జర్నలిస్ట్‌ నాగార్జున రెడ్డి పై హత్యాయత్నం చేసిన అసలు దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »

చీరాలలో మహాత్మునికి నివాళి….

ప్రకాశం : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని.. చీరాల పట్టణంలో గాంధీకి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, కరణం వెంకటేష్‌ బాబు, స్థానిక నాయకులు కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

Read More »

పోలీసుల చాకచక్యానికి దొరికిన దొంగ…

అద్దంకి : ముండ్లమూరు మండలానికి చెందిన చల్లా శివప్రసాద్‌ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది బైక్‌లను దొంగిలించడంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనితో బుధవారం ఉదయం అద్దంకి పోలీసులు చాకచక్యంగా బైక్‌ల దొంగైన శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బైక్‌ల విలువ అయిదున్నర లక్షల రూపాయలు ఉంటాయని దర్శి డీఎస్పీ వెల్లడించారు. నిందితున్ని పట్టుకోవడంలో పోలీసులు వ్యవహరించిన చాకచక్యాన్ని డీఎస్పీ అభినందించారు.

Read More »