నెల్లూరు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి పసుపు కోనుగోలు కేంద్రాన్ని 8 నుంచి పునఃప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సుజాత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రజోతిలో పసుపు అమ్మేదెలా అన్న శీర్షిక ప్రచురితం కావడంతో ఆమె స్పందించారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ కర్షక్‌లో నమోదైన 171 మందితో పాటు, వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన 152 మంది రైతుల వివరాలను జేసీకి, మార్క్‌ఫెడ్ ఎండీకి నివేదిక పంపుతామన్నారు. ఆమె వెంట ఏడీఏ …
Read More »బస్టాండ్ల వద్ద బారులు తీరిన జనం
నెల్లూరు: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే ప్రయాణికులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. విజయవాడ, కడపకి అధిక సంఖ్యలో సర్వీసులు నడుస్తున్నాయి. కాగా కొన్ని చోట్ల ప్రయాణికుల్లో భౌతికదూరం కానరాకుండాపోయింది. జిల్లా నుంచి పలు ప్రాంతాలకి 150కి పైగా బస్సులు తిరుగుతున్నాయి.
Read More »18 నుంచి షార్‌లో కార్యకలాపాలు
శ్రీహరికోట, (సూళ్లూరుపేట): లాక్డౌన్ కారణంగా షార్‌లో కార్యకలాపాలు ఆపివేసినా గత వారంలో తిరిగి పునఃప్రారంభించారు. అయితే ఆదివారం నుంచి సూళ్లూరుపేటలో కరోనా విజృంభించడంతో సోమవారం నుంచి షార్‌లో కూడా లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ప్రస్తుతం మరలా 18వ తేదీ నుంచి షార్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా సూళ్లూరుపేటలో ఉన్న కాలనీలోని ఉద్యోగులకు, పీఈఎల్ కంపెనీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహింపచేస్తున్నారు. ఆ మేరకు కేఆర్పీ కాలనీలోని …
Read More »పెరుగుతున్న కోయంబేడు కాంటాక్ట్ కరోనా కేసులు…
నెల్లూరు: జిల్లాలో కోయంబేడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. సూళ్లూరుపేటలోనే పదిహేను మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒకటీ రెండు రోజుల్లో మరో పది కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. నగరంలో కోయంబేడుకి వెళ్లొచ్చిన వారిలో ముగ్గురుకి పాజిటివ్ అని తేలింది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు.
Read More »సూళ్లూరుపేటలో ఐదు కరోనా కేసులు…
నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేటకు చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ తగిలింది. నిన్నటివరకు గ్రీన్ జోన్లో ఉన్న సూళ్లూరుపేటలో ఒక్కసారిగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సాయినగర్, వనంతోపు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. కరోనా సోకినవారు చెన్నైనుంచి సూళ్లూరుపేటకు కూరగాయలు విక్రయిస్తూ వస్తుంటారు. దీంతో కరోనా సోకిన వారిని క్వారంటైన్‌కు తరలించారు.
Read More »నెల్లూరు జిల్లా నుంచి రెండో ప్రత్యేక రైలు
నెల్లూరు: లాక్‌డౌన్‌తో జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీను తీసుకుని రెండో ప్రత్యేక రైలు ఆదివారం బిహార్‌కు బయలుదేరింది. మూడు రోజులుగా వలస కూలీలు జిల్లాలోని పలు మండలాల నుంచి సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదివారం అనుమతి రావడంతో జిల్లా అధికారులు తొలుత 40 బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు చేరి, రైలెక్కించి స్వస్థలాలకు పంపారు. ముందుగా బిహార్‌కు చెందిన సుమారు 2345 మంది కూలీలు వారి స్వస్థలాలకు పోయేందుకు దర …
Read More »7 బస్సుల్లో తెలంగాణాకు..
నెల్లూరు/ఏఎస్‌పేట: లాక్‌డౌన్‌కు ముందు ఏఎస్‌పేట దర్గాకు వచ్చి ఇక్కడే ఉండిపోయిన యాత్రికులు తమ స్వస్థలాలకు పయణమయ్యారు. గ్రామంలో సుమారు 350 మంది యాత్రికులు ఉండగా, వారిలో తెలంగాణకు చెందిన వారినే అధికారులు గుర్తించి కరోనా పరీక్షలు చేయించారు. ఉన్నతాధికారుల అమనుమతితో ఏడు బస్సుల్లో 180 మందిని పంపించారు. ఇందుకోసం తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి, సీఐ పాపారావు, తహసీల్దారు లక్ష్మీనరసింహ, ఎస్ఐ గోపాల్, ఎంపీడీవో రజనీకాంత్, …
Read More »ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో.. నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరకుంటున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారు.
Read More »నెల్లూరులో 79కి చేరిన కరోనా కేసులు…
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79కి చేరింది. తాజాగా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ కరోనా బాధితుడు మృతి చెందాడు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. ఒక్కరోజే 80 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. గత సోమవారం నుంచి ఈ సోమవారం ఉదయం వరకు …
Read More »నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం..
నెల్లూరు: జిల్లాలోని గాంధీనగర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల కోసం ప్రభుత్వం పంపిన క్లాత్స్కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో మాస్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read More »