Breaking News
Home / States / Andhra Pradesh / Shri Potti Sriramulu Nellore (page 10)

Shri Potti Sriramulu Nellore

6 నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు

నెల్లూరు: సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న నాయుడుపేట మండలం పుదూరులో, 13న పొదలకూరు మండలం తాడిపత్రిలో, 19న చిల్లకూరు మండలం చింతవరం లో, 22న కలిగిరి మండలం చిన్న అన్నలూరులో, 27న వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాశెంలో ఆరోగ్యశ్రీ వైద్య …

Read More »

నేటి నుంచి రెండో విడత వైఎస్సార్‌ కంటి వెలుగు

మరో రెండు నెలలు కొనసాగింపు నెల్లూరు: విద్యార్థి దశలో అనేక మంది కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని నివారించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులకు ప్రభుత్వ వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3,89,162 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 3,66,094 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేశారు. ఇంకా 23,068 మంది …

Read More »

నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం….

నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ కనకదుర్గా మెటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గోడౌన్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్‌ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ.. మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

Read More »

మిత్రుడి కోసం జోలె పట్టిన సహమిత్రులు….

నెల్లూరు: సోమశిలలోని అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్‌షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్‌ ఖాజావళి కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగాలేక 10తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. సెంట్రింగ్‌ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అతడికి ఏడాది క్రితం హసీనాతో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్‌ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. దీనితో …

Read More »

ఇస్రోలో మళ్లీ రాకెట్‌ సందడి

2 నెలల్లో మూడు పీఎ్‌సఎల్వీ ప్రయోగాలకు సిద్ధం మూడు స్వదేశీ, 14 విదేశీ ఉపగ్రహాలు కక్ష్యలోకి శ్రీహరికోట షార్‌ నుంచే పంపే ఏర్పాట్లు శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో మళ్లీ రాకెట్‌ ప్రయోగాల సందడి నెలకొననుంది. చంద్రయాన్‌-2 ప్రయోగ వైఫల్యం నుంచి కోలుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు..మళ్లీ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. రాబోయే రెండు నెలల్లో శ్రీహరికోటలోని షార్‌ నుంచి 3 పీఎ్‌సఎల్వీ రాకెట్లతో 17 ఉపగ్రహాలను కక్ష్యలోకి …

Read More »

ప్రత్యేక హోదాపై సీపీఎం నేత వ్యాఖ్యలు…

నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు అస్త్రంగా వాడుకొంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై. వెంకటేశ్వర రావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గళం వినిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచారని విమర్శించారు. ప్రత్యేక హోదా చట్టబద్ధంగా సాధించుకోవడం మన హక్కని అన్నారు. అఖిలపక్షాన్ని కలుపుకొని అధికార పార్టీ ఉద్యమ బాట పట్టాలని సూచించారు. …

Read More »

వృద్ధ దంపతులపై దాష్టీకం…

నెల్లూరు: నెల్లూరు ఇస్కాన్ సిటీలో స్థలం అమ్ముతానంటూ ఓ వృద్ధ దంపతుల నుంచి రూ.73 లక్షలు తీసుకుని పాలపర్తి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి మోసం చేశాడు. స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తమకు డబ్బులు కావల్సి తిరిగి అడిగితే వారిపై అతడు దాడికి పాల్పడ్డాడు.

Read More »

కులశేఖరపట్నంలో మరో రాకెట్‌ ప్రయోగ కేంద్రం.. వద్దన్న చోటుకే మొగ్గు!

కులశేఖరపట్నంలో మరో రాకెట్‌ ప్రయోగ కేంద్రం అనువుకానిచోట నిర్మాణానికి ఇస్రో సన్నాహాలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అనువైన ప్రాంతాన్ని గుర్తించాలి. అక్కడి వాతావరణం, నైసర్గిక పరిస్థితులు అన్నీ అనుకూలించాలి. అప్పుడే సౌండింగ్‌ రాకెట్ల నుంచి.. జీఎ్‌సఎల్వీ-మార్క్‌3 వంటి బాహుబలి రాకెట్ల వరకూ విజయవంతంగా ప్రయోగించవచ్చు. నెల్లూరులోని శ్రీహరికోట వీటన్నింటికీ అనువైనది కాబట్టే 1971లో ఇక్కడ ‘శ్రీహరికోట హై అల్టిట్యూట్‌ రేంజ్‌’ …

Read More »

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం…

నెల్లూరు: దగదర్తి మండలం లైన్స్‌నగర్‌లో ఎస్‌.ఎల్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొని లారీ బోల్తా పడడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తోంది.

Read More »

వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు….

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇది నేరస్థుల ప్రభుత్వమన్నారు. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారకపోతే దాడులు చేస్తామంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వైసీపీ …

Read More »