Breaking News
Home / States / Andhra Pradesh / Shri Potti Sriramulu Nellore (page 12)

Shri Potti Sriramulu Nellore

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు…

నెల్లూరు: నెల్లూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దౌర్జన్యం చేశారన్న ఎంపీడీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

మహిళా ఎంపీడీవోపై వైసీపీ ఎమ్మెల్యే దాడి….

నెల్లూరు: వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేశారు. కల్లూరిపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారని, లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వనందుకే ఈ దాడికి పాల్పడినట్టు సరళ ఆరోపించారు. ఇంటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం, నీటి పైపులైనును ధ్వంసం చేయడమే కాకుండా కేబుల్‌ వైర్లను సైతం ముక్కలు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు సరళ వెళ్లగా అక్కడ …

Read More »

15న నెల్లూరు రానున్న సీఎం జగన్‌

ఏర్పాట్లు పరిశీలించిన కాకాణి నెల్లూరు/ముత్తుకూరు: రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముత్తుకూరు రానున్నారని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అధికారులు, నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వెనుక ఉన్న మైదానాన్ని పరిశీలించారు. సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రైతు భరోసా సభలో పాల్గొనేందుకు సీఎం నేరుగా హెలికాఫ్టర్‌లో మత్స్యకళాశాలలో దిగేందుకు హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకళాశాల నుంచి సభా వేదిక వద్దకు …

Read More »

చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి…

నెల్లూరు: కలువాయి మండలం పర్లకొండలోని చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు సాయి(12), జగదీష్‌(13)గా గుర్తించారు. ఇంట్లో చేసిన మట్టి వినాయక ప్రతిమలు చెరువులో వేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామాంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More »

నెల్లూరులో రోడ్డు ప్రమాదం…

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం కేతి గుంట మలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Read More »

మహిళల ధర్నా…ఒకరికి అస్వస్థత….

నెల్లూరు: ఆత్మకూరులో ఇళ్ల మధ్య మద్యం షాపు వద్దంటూ స్థానిక మహిళలు ధర్నాకు దిగి మద్యం షాపు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ అస్వస్థతకు గురై పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు షాపు ఫ్లెక్సీని చించి దహనం చేశారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Read More »

దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు…

నెల్లూరు: కావలిలో వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ నేతలు ఇలానే దాడులు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని.. ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోమిరెడ్డితోపాటు, బీద రవిచంద్ర, స్థానిక కార్యకర్తలు బాధితులను పరామర్శించారు.

Read More »

మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్….

నెల్లూరు: సచివాలయ ఉద్యోగులు ఎవరికీ తలొంచొద్దని మంత్రి అనిల్ అన్నారు. సోమవారం నగరంలో సచివాలయ ఉద్యోగులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాటమీద నిలబడి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని వ్యాఖ్యానించారు. నిజాయితీగా ఉద్యోగాలు పొందితే కొందరు జీర్ణించుకోలేక అభాండాలు వేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Read More »

కూలిన వందేళ్లనాటి ధ్వజస్తంభం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి నెల్లూరు సాంస్కృతికం : నెల్లూరు నవాబుపేట శివాలయంలోని ధ్వజస్తంభం ఆదివారం వేకువజామున కూలిపోయింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయంలో ధ్వజస్తంభం కూలడంతో భక్తులు కలత చెందారు. వెంటనే తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేసి సంప్రోక్షణ, శాంతిపూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో నవీన్‌ తెలిపారు. ఈ శివాలయం సుమారు 250 ఏళ్లనాటిది. ధ్వజస్తంభం ప్రతిష్ఠించి వందేళ్లు దాటినట్లు …

Read More »