Breaking News
Home / States / Andhra Pradesh / Shri Potti Sriramulu Nellore (page 2)

Shri Potti Sriramulu Nellore

నేడు సున్నా వడ్డీ పథకం ప్రారంభం

నెల్లూరు: పొదుపు సంఘాల అప్పుల వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించడానికి ప్రవేశ పెట్టిన సున్నా వడ్డీ పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. నెల్లూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్లో అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంపై పొదుపు సంఘాలకు సీఎం లేఖలు రాశారు. ఈ లేఖలు గ్రామ సమాఖ్యల ద్వారా మహిళా సంఘాలకు అందచేసే ఏర్పాట్లు చేశారు. ఈ పథకం ప్రారంభం …

Read More »

ఆర్టీసీ రిజర్వేషన్ల రద్దు.. నగదు తిరిగి చెల్లింపు

నెల్లూరు: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ఈ నెల మెదటివారంలో 16వ తేదీ నుంచి రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఏటీబీ ఏజెంట్లు, ఆన్‌లైన్‌, ఆర్టీసీ బస్టాండుల్లో ప్రజలు రిజర్వేషన్‌ చేసుకున్నారు. జిల్లాలో 3 వేల మందికిపైగా వివిధ దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌లు చేసుకున్నారు. అయితే మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగడంతో రిజర్వేషన్లను ఆర్టీసీ రద్దు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా …

Read More »

నెల్లూరులో 58కి పెరిగిన కరోనా కేసులు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 58కి పెరిగింది. ఈ వ్యాధి బారిన పడి కోలుకుని ఒకు డిశ్చార్జ్ అవగా, ఇద్దరు మృత్యువాతపడ్డారు. అలాగే ఐసోలేషన్ వార్డులో 55 మంది, క్వారంటైన్ కేంద్రాల్లో 408 మంది ఉండగా విదేశాల నుంచి వచ్చిన 142 మంది సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఏపీలో కోరానా వైరస్ విజృభింస్తుండటంతో దాదాపు 11 జిల్లాలను కేంద్రం హాట్‌స్పాట్‌గా గుర్తించింది. ఆ జాబితాలో నెల్లూరు కూడా …

Read More »

నెల్లూరు జిల్లాలో రెండవ కరోనా మరణం

నెల్లూరు: జిల్లాలో రెండవ కరోనా మరణం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌తో చనిపోయినట్లు వైద్యుల నిర్దారించారు. పాజిటివ్ వ్యక్తితో బస చేసిన ఏడుగురిని క్వారంటైన్‌కు తరలించారు.

Read More »

అంతా లాక్‌డౌన్ పుణ్యమే…

నెల్లూరు: పిచ్చుకలే కనిపించకుండాపోయిన నేటికాలంలో, లాక్‌డౌన్ కారణంగా అంతా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఓ కారు సైడ్ మిర్రర్ సందులో పిచ్చుక గూడుకట్టుకుంది.

Read More »

56కు చేరిన పాజిటివ్ కేసులు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 56కు చేరాయి. తడలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ ఆర్ధోపెడిక్ డాక్టర్ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే నిర్వహించగా కుటుంబసభ్యులు ఎవరూ కూడా హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయన భార్య, ఫార్మాసిస్ట్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా …

Read More »

నెల్లూరులో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్…

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నిన్నటి పరీక్షల్లో బయట పడటంతో అధికారులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తడకు చెందిన వ్యక్తికి ఇప్పటికే ఐసోలేషన్‌లో చికిత్స జరుగుతోంది. అతని ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వాకాడులో పదేళ్ల బాలికకు కూడా కరోనా పాజిటివ్ అని నివేదికలో స్పష్టమైంది. ఇకపై పిల్లలున్న ఇంటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్య …

Read More »

నెల్లూరులో హైఅలెర్ట్….

నెల్లూరు: నెల్లూరు జిల్లాకి ఢిల్లీ లింకులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి జిల్లా నుంచి 68 మంది వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. 34 మందికి సంబంధించిన రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. 43, 47 డివిజన్లని అధికారులు రెడ్‌ జోన్‌లుగా ప్రకటించారు.. నిత్యవసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే‌ సరఫరా చేస్తున్నారు.

Read More »

ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు

కరోనా సెలవులతో విద్యాశాఖ చర్యలు నెల్లూరు/సీతారామపురం: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ విద్యార్థుల ఇళ్లకే వెళ్లి మధ్యాహ్న భోజనం సరుకులను అందిస్తోంది. విద్యార్థులకు పౌష్ఠికాహార లోపం తలెత్తకుండా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అనుసరించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాల విద్యా సంక్షేమ సహాయకులు, వలంటీర్ల సహకారంతో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కరోనా సందర్భంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు …

Read More »

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుండి చెన్నైకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read More »