Breaking News
Home / States / Andhra Pradesh / Shri Potti Sriramulu Nellore (page 3)

Shri Potti Sriramulu Nellore

ఏపీలో పొలిటికల్ కరోనా కొనసాగుతోంది..

నెల్లూరు : ఏపీలో పొలిటికల్ కరోనా కొనసాగుతోందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఆనం మాట్లాడుతూ.. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఆరోపించారు. మార్చి 31 లోగా నిధులు వినియోగించుకోవాలి.. లేకపోతే తర్వాత ఖర్చుపెట్టే వీలుండదన్నారు. కరోనా పేరుతో తప్పుడు నిర్ణయాలు! ‘ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటే అసెంబ్లీ …

Read More »

నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత..

నెల్లూరు: ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ యువకుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. మరో 14 మంది అనుమానితులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 3 ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను వైద్యులు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా నగరంలో సినిమా థియేటర్లను మూసివేశారు.

Read More »

టీడీపీకి సవాలు విసిరిన ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు: వెంకటాచలం మండలంలో జరిగిన గొడవకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య గొడవ మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేకే వైఎస్సార్‌ సీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు …

Read More »

బ్రేకింగ్ న్యూస్: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

నెల్లూరు: ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా నిర్ధారణ అయింది. 14 రోజుల క్రితం అతడు ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని ప్రత్యేక వార్డులో అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటు కరోనా సోకిన వ్యక్తి నివాసం ఉండే చిన్నబజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

Read More »

నెల్లూరు యువకుడికి కరోనా?

నెల్లూరు: నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా(కోవిడ్‌–19) వైరస్‌ సోకినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు ఈ నెల 6న చెన్నై మీదుగా స్వస్థలం నెల్లూరుకు వచ్చాడు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో వైద్య అధికారులు ఈ నెల 7న నెల్లూరులోని బోధనాసుపత్రిలో రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపారు. ప్రాథమికంగా పాజిటివ్‌ (‘ప్రిజమ్‌టీవ్‌ పాజిటివ్‌) అని వచ్చింది. …

Read More »

మద్యం విక్రయాల నిలిపివేతపై కలెక్టర్‌ కీలక వ్యాఖ్యలు

నెల్లూరు: మద్యం విక్రయాల నిలిపివేతపై కలెక్టర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 12 నుంచి మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు రాలేదన్నారు. పోలింగ్‌ ముందు రోజు నుంచే మద్యం విక్రయాలు బంద్ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి మద్యం విక్రయాలు నిలిపివేస్తామని రెండు రోజుల క్రితమే మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు.

Read More »

రేపటి ప్రయోగం వాయిదా

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు (గురువారం) చేపట్టనున్న జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం వాయిదా పడినట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు. 2,268 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాల్సి ఉంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం రేపు సాయంత్రం 5.43 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోవాల్సి …

Read More »

గర్భిణీకి సాయం అందించిన ఎస్సై

నెల్లూరు: నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. మన్సూర్‌నగర్‌కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకొని …

Read More »

నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10 లాంచ్‌ రిహార్సల్స్‌

సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్‌–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్‌–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్‌ సెన్సింగ్‌ …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయిస్తాం

నెల్లూరు, పొదలకూరు: రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయిస్తామని, కొనుగోలు కేంద్రాల్లో, మిల్లర్ల వద్ద వచ్చే తేమ శాతం ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని డేగపూడిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఉండగా, కొత్తగా చెన్నారెడ్డిపల్లి, …

Read More »