Breaking News
Home / States / Andhra Pradesh / Srikakulam

Srikakulam

గొర్రెపిల్లలపై దాడి చేసిన అడవిపిల్లి….

శ్రీకాకుళం: సోంపేట మండలం తురక శాసనం గ్రామంలో ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో అడవిపిల్లి గొర్రెల సెలలో ఉన్న గొర్రెపిల్లలపై దాడి చేసి 6 పిల్లలని పీకలు కొరికి చంపిందని సంబంధిత యజమాని కర్రి సోమయ్య రోధించాడు. గత కొద్దిరోజులుగా అడవి జంతువుల దాడిలో పశువులు మృత్యువాత పడుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెండు రోజులు క్రితం అదే గ్రామానికి …

Read More »

శ్రీకాకుళంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ ర్యాలీ….

శ్రీకాకుళం: సంతబొమ్మాళిలో సంతబొమ్మాళి యూత్, మండల పరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను వాడొద్దని, బహిరంగంగా మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్లునే వాడాలని, ఆరు బయట చెత్తను వేయొద్దని అంటూ నినాదిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా పాఠశాలలో ప్రధానోపాధ్యాలు యస్.అప్పలరాజు, యూత్ ప్రధాన బాధ్యులు కూచెట్టి భానుప్రకాష్, అట్టాడ సాయికుమార్ విధ్యార్ధులకు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్ధాలు వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీని …

Read More »

ప్రమాదవశాత్తూ కాలుజారిపడిన వ్యక్తి గల్లంతు…

శ్రీకాకుళం: శుక్రవారం వీరఘట్టంలోని మండల కేంద్రానికి చెందిన గొదబ సంజీవ్‌ (62) వట్టిగెడ్డలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ కాలుజారిపడి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. సంజీవ్‌ కుటుంబీకులు, గ్రామస్థులు అతని కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Read More »

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్…

శ్రీకాకుళం: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్టు చేసి కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాతల సామాజిక భవనానికి వైసీపీ రంగులు వేయటాన్ని అడ్డుకున్నారన్న అభియోగంపై ఆయనపై కేసు నమోదైంది. గ్రామంలో పంచాయితీ భవనం ఉండగా సామాజిక భవనానికి రంగులు వేయటంపై కలమట అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసి 143, 186, 341,149 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

Read More »

మీడియా ప్రతినిధిపై వైసీపీ కార్యకర్తలు దాడి…

శ్రీకాకుళం: మీడియా ప్రతినిధిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరులో చోటు చేసుకుంది. పేకాట ఆడుతున్న వైసీపీ నేతల ఫోటోలు తీసినందుకు మీడియా ప్రతినిధి కర్ణ వీరుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కర్ణవీరుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read More »

7 నుంచి శ్రీకాకుళంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

శ్రీకాకుళం : శ్రీకాకుళంలో నవంబరు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత.. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరు కానున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ జె.నివాస్‌ బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మీ నియామక ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతమయ్యేలా కృషి చేయాలని …

Read More »

కార్పొరేట్లకు వరాలు- సామాన్యులపై భారాలు

శ్రీకాకుళం : కార్పొరేట్లకు వరాలు- సామాన్యులపై భారాలు ‘ అనే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటిస్తూ… కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాప్త నిరసనల్లో భాగంగా.. సీపీఎం రాజాం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.

Read More »

శ్రీకాకుళంలో షార్ట్‌ ఫిల్మ్‌ సందడి…

శ్రీకాకుళం: సమాజానికి సందేశమిచ్చే లఘు చిత్రం హెల్మెట్‌ అని మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక వాసు దేవుని ఆలయంలో మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్‌ హెల్మెట్‌ షూటింగ్‌ ఫస్ట్‌ షాట్‌ తీసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు యాజక కిషోర్‌ మాట్లాడుతూ పిక్సెల్‌ కె మూవీస్‌ ప్రొడక్షన్‌ వారి హెల్మెట్‌ లఘుచిత్రం చక్కని సందేశాత్మక చిత్రమన్నారు. ఒక బాధ్యత ఉన్న కుటుంబంలోని యువకుడు …

Read More »

అరబిందో కార్మికుల సమ్మె… నేతలు అరెస్ట్…

శ్రీకాకుళం : పైడిభీమవరం అరబిందో కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి కార్మికులు భారీ సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో స్వచ్ఛందంగా 4000 మంది కార్మికులు పాల్గొన్నారు. సమ్మెను విరమించాలంటూ.. పోలీసులు కార్మికులను అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంతమంది నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో విషాదం…

శ్రీకాకుళం: వాటర్ ట్యాంకర్ కిందపడి చిన్నారి మరణించిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తమపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటూ వెళ్లి కొంతల దీపక్(3) అనే చిన్నారి వాటర్ ట్యాంకర్ కింద పడి మృత్యువాత పడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »