Breaking News
Home / States / Andhra Pradesh / Visakhapatnam

Visakhapatnam

కుప్పకూలిన భారీ వినాయక మండపం

విశాఖపట్నం: షీలానగర్‌లో భారీ వినాయక మండపం కుప్పకూలింది. 70 అడుగుల వినాయకుడి విగ్రహం ఏర్పాటుకు మండపాన్ని ఏర్పాటు చేశారు. గాలివానకు భారీ వినాయక మండపం కుప్పకూలింది. వినాయక మండపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read More »

రివార్డు ప్రకటనతో లొంగిపోయిన మావోయిస్టులు

విశాఖ: విశాఖ జిల్లాలోని పోలీసు అధికారులు పలువురు మావోయిస్టులపై రివార్డు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా డీఐజీ కాళిదాసు సమక్షంలో మావోయిస్టు డివిజన్‌ కమిటీ సభ్యుడు నవీన్‌, ఏరియా కమిటీ సభ్యులు కొర్రా శ్రీకాంత్‌, సింద్రి, కాంద్రి సావిత్రి లొంగిపోయారు. నవీన్‌పై రూ.6లక్షలు, శ్రీకాంత్‌, సింద్రి, కాంద్రిపై రూ.4లక్షల రివార్డు ఉంది.

Read More »

విమర్శకుల నుంచి కూడా మన ముఖ్యమంత్రికి ప్రశంసలు

విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 80 రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌ రెడ్డి కొనియాడారు. నవరత్నాల అమలుతో పాటు కీలక బిల్లులు తీసుకురావడంతో విమర్శకుల నుంచి సైతం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద వచ్చిన వరద నీటిపై కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయం చేయడం దిగజారుడు తనమని ఎద్దేవా …

Read More »

సీఎం జగన్ పై ఎంపీ సుజనాచౌదరి విమర్శలు….

విశాఖ: సీఎం జగన్‌ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలన ఉందని విమర్శించారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Read More »

వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ

విశాఖ: ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు విమర్శలు గుప్పిస్తూ జగన్ పనితీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరనిపిస్తోందన్నారు. ప్రజావేదికను ఒకరోజులో కూల్చిన ప్రభుత్వం 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఇసుక లేకపోవడంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 70 రోజుల్లో ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆరోపించి ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు …

Read More »

తూర్పు రాజస్థాన్‌ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : రానున్న 48 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు రాజస్థాన్‌ వద్ద స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది.

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత…

విశాఖపట్నం: విశాఖపట్నంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. నగరంలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు …

Read More »

కోస్తాలో తేలికపాటి వర్షాలు

విశాఖపట్నం: నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తుండడంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని, ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురవవచ్చునని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా అల్పపీడనం తూర్పు రాజస్థాన్‌ వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Read More »

వ్యక్తి మరణించడంతో బయటపడిన సిబ్బంది చేతివాటం

విశాఖపట్నం: నగరంలోని ద్వారకానగర్ ఇండియన్ బ్యాంకులో బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రుణం చెల్లించిన తనకు బంగారం కాజేసి నకిలీ బంగారం ఇచ్చారని మహిళ వాపోతూ బ్యాంకు సిబ్బందిపై ఆరోపించింది. గోల్డ్ లోన్ విభాగంలో పనిచేసిన సింహాచలం అను వ్యక్తి మోసం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం మృతిచెందడంతో వ్యవహారం బయటికొచ్చిందని బాధితురాలు తెలిపింది.

Read More »

విశాఖ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌..

జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ జాయింట్‌ చెకింగ్‌ మెటల్‌ డిటెక్టర్లు, డాగ్‌ స్క్వాడ్‌తో ప్లాట్‌ఫారాలు, బోగీల పరిశీలన హైఅలర్ట్‌ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సీనియర్‌ డీఎస్సీ జితేంద్ర విశాఖపట్నం: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్‌ ఉన్న నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్‌లో బుధవారం మెగా సెక్యూరిటీ చెక్‌ నిర్వహించారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అధికారులు విస్తృత తనిఖీ లు నిర్వహించారు. ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ సిబ్బంది ఈ …

Read More »